ఓనమాలు రాకున్నా , ఓంకారనాథమంటా, అయ్యా,
నీ పాదాలు బట్టుకొని,పదాలు అల్లుకుంటా!
నీ పాట పాడుకుంట మల్లన్నో
నీ ఆట ఆడుకుంట మల్లన్నా !! స్వామీ.
రావణాసురునీ, గాయాలు మానిపి ,
వైద్యనాథునిగా పేరుగన్న స్వామి !
బీముడనే అసురుని భస్మం చేసి ,
బీమశంకరుడై నిలసిన స్వామీ !!
శ్రీరామచంద్రుని సేతులల్ల పుడుతివని,
స్వామీ,
రామేశ్వరుడని రాగాలు అందుకుంటా,
నీ పాట పాడుకుంట మల్లన్నో
నీ ఆట ఆడుకుంట మల్లన్నా !!
అయ్యా, శివయ్యా
దారుకావణములో నాగబరణం ధరించినా,
మా నాగేశ్వరుడా !!
కష్టాలెన్నీ కలిగిన గానీ,కాశీకి వస్తా
విశ్వేశ్వరుడా !!
గౌతమీ తీరాన ఘనముగా వున్నా,
త్రయంబకేశ్వర తాండవం ఆడు వేలా !!
నీ పాట పాడుకుంట మల్లన్నో
నీ ఆట ఆడుకుంట మల్లన్నా!!
ముల్లోకాలు ఏలే ముక్కంటి ఈశుడాని
శ్రీశైలం కొండల్ల సిరిగల్ల దేవుడానీ!!
నీ పాట పాడుకుంట మల్లన్నో
నీ ఆట ఆడుకుంట మల్లన్నా!!
ఈ పాటను ఎలా ఉంటుంది పడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.