శివ శివ శివయని పిలిచిన పలుకవు
హర హర హరయని అడిగిన చెప్పవు
ఎవరేమన్నారు స్వామి నిను ఎవరేమన్నారు స్వామి
కైలాసములో పార్వతిదేవి శ్రీశైలములో శ్రీభ్రమరాంబ
విజయవాడలో శ్రీకనకదుర్గ వాళ్ళేమన్నారు స్వామి
నిను ఎవరేమన్నారు స్వామీ
కాణిపాకలో కన్నెమూల గణపతి శబరిగిరిపై అయ్యప్పస్వామి
పళనివాసుడు సుబ్రహ్మణ్యం వాళ్ళేమన్నారు స్వామీ
నిను ఎవరేమన్నారు స్వామీ
భద్రాచలములో శ్రీరామచంద్రుడు
పండరీపురములో శ్రీపాండురంగడు వాళ్ళేమన్నారు స్వామీ
నిను ఎవరేమన్నారు స్వామీ
ఏడుకొండల వెంకన్నస్వామీ యాదగిరిగుట్ట నరసింహస్వామీ
కొండగుట్టపై అంజన్న స్వామీ వాళ్ళేమన్నారు స్వామీ
నిను ఎవరేమన్నారు స్వామీ
ఆదియు నీవే అంతము నీవే అండపిండ బ్రహ్మాండము నీవే
ఎవరేమంటారు స్వామీ నిను ఎవరేమంటారు స్వామీ