12. రావయ్య అంజన్న మాలి దేవుడా - ravaiah anjaiah - హనుమాన్ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
0 minute read

పల్లవి:-
రావయ్య అంజన్న మపాలి దేవుడా
రాగాలు మాకు రావు తాళాలు మాకు లేవు
అరుపులే మా పిలుపులో అంజన్న
కేకలే కైమోర్పులో

చరణం:-1
జగమంత నిండినావు జగదేకవీరుడావు
పల్లె పల్లెలున్నావు పట్టణంలో ఉన్నావు
ధర్మశంఖం ఊదినవులే అంజన్న
కొండగట్టులో వెలసినవులే

చరణం:-2
కొండలనే పిండి చేసే దండి బలవంతుడావు
బండకు చందనమేసి నీముందు నిలుచుంటే
పిలిచినా పలుకుతుంటవే అంజన్న
కొలచినా కాచుతుంటవే

చరణం:-3
సముద్రాలు దూకినావు సీతమ్మనులేంకినావు
రామయ్య కంటి నీరు తుడిచినట్టి బంటువయ్యా
నరుల బాధ నికోలెక్కనా అంజన్న
ప్రతిరోజూ నిన్నే మొక్కనా

చరణం:-4
దిక్కుమక్కు లేనోల్లం దీక్షలే చేసినాము
సిలవంటి మమ్ములను శిల్పాలుగ మలచినావు
బండ బారినా బ్రతుకులే అంజన్న
సుందరంగ దిద్దినావులే


ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.

#telugubhajanapatalu
#bhajanapatalutelugu
#bhajanapatalu
#song
#devotionalsongs

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat