శ్రీశైల వాసుడా శ్రీమల్లికార్జున అమరావతీ నిలయ అమరా లింగేశ్వర పాలన వాసుడా పాహి పరమేశ్వరా మేళచెరువు నిలయ శంభో లింగేశ్వర గంగమ్మ దొరుడా గంగమ్మ దొరుడా గంగమ్మ దొరుడా గంగాధర పార్వతీనాధుడా పరమేశ్వరా ఓం శివాయ నమఃశివాయ ఓం శివాయ నమఃశివాయ "2"
గరలాన్ని మింగి నీవు గరళ కంఠుడైనావు
కాటిలోన కాపురం ఉండే కాలకంటుడు నీవే
అమ్మేలా రావయ్య అమ్మేలా రావయ్య
అమ్మేలా రావయ్య మంజునాధుడా వేదన తీర్చవయ్య వైద్యనాథుడా
ఓం శివాయ నమఃశివాయ ఓం శివాయ నమఃశివాయ "2"
ముల్లోకాలేలేటి ముక్కంటి నీవయ్యా మంచు కొండల్లో ఉన్న మహేశ్వర నీవయ్యా జాలన్న చూపవయ్యా జాలన్న చూపవయ్యా జాలన్న చూపవయ్యా జంగమేశ్వరా నాగన్న చుట్టుకున్న నాగేశ్వరా ఓం శివాయ నమఃశివాయ ఓం శివాయ నమఃశివాయ "2"
మారేడు దళములిచ్చి పూజలే చేసాము నేరేడు ఫలములిచ్చి నైవేద్యం పెట్టాము చల్లంగా చూడవయ్యా చల్లంగా చూడావయ్యా చల్లంగా చూడవయ్యా సంగమేశ్వరా విన్నపాలు మన్నించు విశ్వేశ్వరా ఓం శివాయ నమఃశివాయ ఓం శివాయ నమఃశివాయ "2"
ఈ పాటను ఎలా పడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.