తల్లి గర్భములో - అణువుగా మము వేసి
తొమ్మిది మాసాలు - మమ్మే నువు కాచి బయటకు తెచ్చిన భగవంతుడవే అయ్యాప్పా-- మా, బ్రతుకు నెట్టా రావయ్యా మణికంఠ..!!తల్లి!
జగమే నాటక రంగం చేసి---
-జనులందరిని నటులను చేసి
సూత్రదారి గా నువ్వు ఉండి--
-పాత్రదారుల మమ్మే చేసి
నువ్వు ఆడించే నాటకమే ఈజన్మ...
ఈమున్నాళ్ల ముచ్చట అగుట మాకర్మా..
!తల్లి!
పంచా భూతలనే పట్టి మట్టి- బొమ్మలు చేసి
ప్రాణమే దానికి పోసి- తలరాతంట్టు నువ్వే రాసి
సిరి నవ్వులతో సిరి సంపదలు ఇచ్చేవు-
వాటిని దూరము చేసి దుక్కాలే-
మిగిలించెవు
!!!తల్లి!!
తల్లిదండ్రులను ఇచ్చేవు-- --భార్యబిడ్డలను ఇచ్చేవు
బంధుమిత్రులను ఇచ్చేవు ---
--ఆత్మ బంధాలేసావు.
సంసార మానే సాగరాన వేసేవు--
దాని మీద మేము ఆవేదన పడితే చూసేవు.
!! తల్లి!!