నువ్వు తప్ప దిక్కు ఎవరు గోవిందా
నిన్ను మించి ఎక్కువెవ్వరు గోవిందా
నీ అంత దాతెవ్వరు
గోవిందా
నీ కన్నా నేతెవ్వరు గోవిందా
// నువ్వు తప్ప //
1) నువ్వు తప్ప దారెవ్వరు గోవిందా
నిన్ను మించి తారెవ్వరు గోవిందా
నీ అంత వీరుడెవరు
గోవిందా
నీ కన్నా ధీరుడెవరు గోవుందా
// నువ్వు తప్ప //
2) నువ్వు తప్ప అండెవ్వరు గోవిందా
నిన్ను మించి దండెవ్వరు గోవిందా
నీ అంత అందమెవరు
గోవిందా
నీ కన్నా బంధమెవరు గోవిందా
// నువ్వు తప్ప //
నిన్ను మించి ప్రీతి ఎవరు గోవిందా
నీ అంత భాగ్యలెవరు
గోవిందా
నీ కన్నా యోగ్యులెవరు గోవుందా
// నువ్వు తప్ప //
ఈ పాటను ఎలా పడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
సింధు భైరవి రాగం ప్రధానంగా
త్రిశ్ర జాతితాళం
శృతి 7 (B)