54. Vandanam Ganapati - వందనం గణపతి మహారాజా - వినాయక భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
1 minute read

మద్యమావతి రాగం ఆదితాళం తిశ్రనడక

పల్లవి
వందనం గణపతి మహారాజా
అభి వందనం గణపతి మహరాజా
"మహారాజా.... మహారాజా ॥ వందనం ॥

1 వ చరణం
దోర బొజ్జ స్వామికి పాధాభివందనం
ఉండ్రాల దేవునికి హృదయాభి వందనం
గిరిజా తనయునికి అరుదైన వందనం
పరమేశ్వర పుత్రునికి ప్రథమ పూజ్య వందనం॥ వందనం ॥

2 వ చరణం
మూషికా వాహనా ముద్దు లొలుకు గజాననా
ముందుగా చేసెదము నీ నామ స్మరణ
వినాయకా వినాయకా వినాయకా అంటూ
భజియింతుము కరుణింపగ రావయ్య స్వామి ॥ వందనం ॥

3 వ చరణం
విద్యనొసగు ధాతవై త్రిలోకాల నేతవై
ఏక దంత ధారుడవై వెలుగొందు విఘ్నేశా
దేవతలే నిను కొలచి తరియించుచుండా
నీ ఘనతను పొగడంగ మేమెంతస్వామి || వందనం



ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.  


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat