తిరుమలవాసా రారా శ్రీ వేంకటరమణా రారా
ఆపద్బాంధవ రారా ఓ ఆనాధ రక్షక రారా
తిరుమల తిరుపతిలోనా ఆ బంగరు కోవెలలోనా
సిరిగల దైవముగాను - శిల రూపముగా వెలిశావు
కొండలు కోనలు దాటి - నీ గుడి వాకిటను చేరి
కోరితి నీ దరిశనము తెర తీయగ వేగమె రారా
ఆపద మొక్కులవాడా ఓ ఆశ్రిత జన మందారా
నీ పద సన్నిధి నిలిచి నీ ముడుపులు తెచ్చితి రారా
కలియుగ వైకుంఠమురా నీ నిలయం రమణీయమురా
కొలిచితి భాగ్యమునియరా ఓ కోమల రూపా కనరా
బంతి చామంతి పూలు పున్నాగ మల్లియ సరులు
కస్తూరి తిలకము దిద్ది -నీ పూజలు చేతుము రారా
ధరణిలో అప్పాపురము ఈ అప్పన్నదాసుని కలము
నిరతము నీకృతి వ్రాయా నను కావర కోనేటిరాయా
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.