ఇరుముడి కట్టేసినం…నీ సేవలు జేసినం….
మా మొక్కులు ముట్టాలని నీ కొండకు మొక్కినం…..
పాపలను కడిగేసే పంబాలో మునిగినం….
శరణం అయ్యప్ప….అని నిన్నే మేం మొక్కినం…
కన్నె సాములు కాలి నడకనొచ్చెను….
కాలే ఈ దేహము దాసోహ మిచ్చెను….
అయ్యప్ప…నీ సేవకే అంకితమిచ్చెను…..
ఇరుముడి కట్టేసినం…నీ సేవలు జేసినం….
మా మొక్కులు ముట్టాలని నీ కొండకు మొక్కినం…..
పాపలను కడిగేసే పంబాలో మునిగినం….
శరణం అయ్యప్ప….అని నిన్నే మేం మొక్కినం…
పాలాభిషేకాలు సన్నీల్లా స్థానాలు ….
మణికంఠ నీ రూపమెంతో సక్కదంట
మా కంట మిము జూసిన మా భాగ్యమంట(కోరస్)
పద్దెంది పడి మెట్లు ఎక్కేక్కి వస్తుంటే ….
మణికంఠ నీ మాయలో నే వుంటిమంత .
మా కంట నీ మహిమలే ఈ శబరియంత (కోరస్)
మా దీనులను మోసినవ్ శేరణం శరణం అయ్యప్ప
నీ ధీమాతో బతికినం శరణం శరణం అయ్యప్ప
నీ కొండకు జేరి సేవ జేసుకుందుమో
నీ పాదాలను దర్శించిన జన్మ ధన్యమో
హరి హర పుత్రా అయ్యప్ప నీ మాలలే వేసినము
ఇరుముడి కట్టేసినం…నీ సేవలు జేసినం….
మా మొక్కులు ముట్టాలని నీ కొండకు మొక్కినం…..
పాపలను కడిగేసే పంబాలో మునిగినం….
శరణం అయ్యప్ప….అని నిన్నే మేం మొక్కినం…
కోరిన వరములిచ్చి కోర్కలు దీర్చేటి
మణికంఠ…నీ మరుమమెందో ఎరుగమయ్య
జగమంతా..నీ స్మరణే శరణం అయ్యప్ప…
కొండలు తలపించే నీ గిరి క్షేత్రామయ్య …..
కాలినడకన మేమొచ్చినమయ్య సామి…..
కలియుగ దైవమ చూపించవ దయ…..
నీ సన్నిధి దరి చేరినాము శరణం శరణం అయ్యప్ప
నీ పూజలు జేసినాము శరణం శరణం అయ్యప్ప….
హారతి పల్లాలు గుడినిండ గంటలు
నీ పాటవాడుకుంటూ నిను వేడుకుంటము…
ఎల్లప్పుడు మమ్ములను సల్లంగా సూడు సామి ……
ఇరు ముడి కట్టేసినం…నీ సేవలు జేసినం….
మా మొక్కులు ముట్టాలని నీ కొండకు మొక్కినం…..
పాపలను కడిగేసే పంబాలో మునిగినం….
శరణం అయ్యప్ప….అని నిన్నే మేం మొక్కినం…
ఈ పాటను ఎలా పాడాలో ఇంకా టచ్ చేసి వినండి.