సాకి
చావు తప్పదనే సత్య మెరిగి కూడ"2"
చర్మ దేహము చూసి గర్వపడుతూ.... సర్వాధికారియైన స్వామినే మరచి నీవు....
ఘోర నరక మందు దూరెదవూ...
బ్రహ్మ తత్వ మెరుగకా.భక్తిని విధానాడి .
ధనము ధనమంటూ నీవు మదము తోనా... ఆ...ఆ.. ఆ...
ప్రాకులాడి ధరపై పాపి కాకు..."2"
తెలుసుకోర నరుడ బ్రతుకు మర్మం.. ఆ... ఆ... ఆ....
పల్లవి
చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ
రాశాడు ఆ బ్రహ్మ రాత
ఎట్లు రాశాడో ఆ బ్రహ్మ రాతా ...
చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ
చరణం 1
పువ్వులు పూసే పొదరిల్ల లోన
గుడిలోన కొన్ని జడలోన కొన్ని
రాశాడు ఆ బ్రహ్మ రాతా
ఎట్లు రాశాడో ఆ బ్రహ్మ రాతా
చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ
చరణం 2
ఉన్న నాడు అందురు కలరు
పోయిన నాడు ఎవరు రారు
రాశాడు ఆ బ్రహ్మ రాతా
ఎట్లు రాశాడో ఆ బ్రహ్మ రాతా
చేశాడు బ్రహ్మ. ఈ మట్టిబొమ్మ..
చరణం3
అనుకున్న దేదో జరగక పాయే
జరిగేదేదో తెల్వక పాయే
రాశాడు ఆ బ్రహ్మ రాతా
ఎట్లు రాశాడో ఆ బ్రహ్మ రాతా
చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ
చరణం4
గండిలో వెలసిన ఓ అంజన్నమమ్మేలు స్వామివని నిను నమ్మినాము
రాశాడు ఆ బ్రహ్మ రాతా
ఎట్లు రాశాడో ఆ బ్రహ్మ రాతా
చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ.