మనసారా హరి భజన చేయరా
నోరార నారాయణ అని అనరా
నీ నోరార నారాయణ అని అనరా
||మనసారా|
పాటే రాదని ప్రజలు నవ్వుదురని (2)
గాత్ర శుచియే కమ్మగ లేదని
పాటకు సరియగు తాళం లేదని (2)
భయము బిడియము బాధ వలదురా
||మనసారా|
పాటయు గాత్రము తాళమున్ననూ (2)
మనసే లేని స్మరణే వృధారా
మనసొక చోట తనువొక చోట (2)
ఉన్న మానవుని జన్మే వృధారా
||మనసారా|
యోగిలైనా మహాయోగిలైనా (2)
పూర్వ జన్మపు సుకృతము పోదురా
నారాయణయను నామస్మరణమే (2)
నరక బాధలు తొలగజేయురా
|| మనసారా|
ఈ పాట లిరిక్స్ పంపినవారు:
బైరంపల్లి భజన మండలి
మిడ్జిల్ మండలం - మహబూబ్ నగర్ జిల్లా
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.