యేమి సేయుదునయ్యా రామా।
నన్నూ। యెవరు బ్రోతురు పరంధామా (2)
యేమి సేయుదునయ్యా యెంత వేడినగానీ । (2)
నామీద దయరాదూ నానోము పలమేమో..... ॥ యే ॥
జాలిజేయుకు మ్రొకేదామా - అపాదాలకెంతయు నోపాలేమా! (2)
నీలాలోచన భక్తిపాల సత్కరుణాల | వాల (2)
మీపదసేవా వాంఛదీరగ జేతూ.... ॥ యే ॥
తాపత్రయము లానూ భాపూ । నా తలిదండ్రివయు దారీజూపూ । (2)
వోపాపరహీతా నేనే పాటులెరుగానూ । (2)
యీ పాపి మాయ నన్నాపబా బెడుతుంది ॥ యే ॥
ఓహో మన్నెముకొండ ధామ - పాహి పాహి వైదేహిలలాను (2)
అహ శ్రీవేపూరూ హనుమదాసును యిట్టు (2)
మోహవారదీముంచీ మౌసగింపుదు తండ్రి ... ॥ యేమి ॥
లిరిక్స్ పంపినవారు:
భైరంపల్లి భజన మండలి
మిడ్జిల్ మండలం - మహబూబ్ నగర్ జిల్లా
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.