తుల్లీ తుల్లీ పడబోకే తుంటరీ బొమ్మా
మళ్ళీ మళ్ళీ రాదోయీ మానవ జన్మ మానవజన్మ
ఎంతపెద్ద చదువులు ఉన్నా చక్రవర్తి తానేయైనా
చావుతప్పదోరన్నా పరమహంస కైనా
నీ వన్నెలు చిన్నెలు కన్నా
పరమాత్ముని కృపయే మిన్నా....//2//
అది మనకు లేకుంటే బ్రతుకంత సున్నా
|తుళ్ళీ తుళ్ళీ|
ఎందుకొరకు జన్మించావో ఏమికర్మ చేస్తున్నావో..2
ఇకనైనా తెలుసుకో గురుతెరిగీ మసలుకో..2
మట్టికుండ ఈ దేహము వదిలిపెట్టు సందేహమూ2
అందరిలో వెలిగేటి పరమాత్మ ఒక్కడే...
|తుళ్ళీ తుళ్ళీ|
జన్మలెన్ని ఉన్నాగానీ మానవ జన్మెంతో మేలు..2
జన్మకు సరి కర్మచెయ్ ముక్తిని సాధించవోయ్..2
నీటి బుడగ ఈ జీవితం మరువబోకు నీ గమ్యము
మరిచావో నీ బ్రతుకు శూన్యాతి శూన్యం
తుల్లీ తుల్లీ పడబోకే తుంటరీ బొమ్మా
మళ్ళీ మళ్ళీ రాదోయీ మానవ జన్మ మానవజన్మ
లిరిక్స్ పంపించినవారు:
భైరంపల్లి భజన మండలి
మిడ్జిల్ మండలం - మహబూబ్ నగర్ జిల్లా
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.