భీంప్లాస్ రాగం. ఆది తాళం
పల్లవి:
భజనంటే నీకింత చేదా భగవంతుని మరచుట యేలా "2"
భజనంటే నీకింత భయమెందుకురా జీవా"2"
భారము స్వామిదే భయమేల చెందెదవు.
"భజనంటే నీకింత చేదా"
ఆలుపిల్లలు, తనవారనచూ జీవాఆశ వదులుటే ముందే మేలు"2"
కాలయముడు వచ్చి కఠినమునక నిన్నూ"2"
ప్రాణంబులను తీయ భయమేల చెందెదవు
"భజనంటే నీకింత చేదా"
అపుడేమి భజనా చేసెదవు జీవాఇపుడేమో శ్రీహరి యనలేవు "2"
జీవి వెళ్లేవేళ జీవ నాడులన్నీ "2"
భాద పెట్టెటి వేళ భజననేమి చేసెదవు
"భజనంటే నీ కింత చేదా"
ఈ హనము భక్తుని మాట ముందూ యోచించినా తెలియు బాట "2"
కల్ల సంసారంబు కనుగొంటే ముక్తేరా"2"
మళ్ళీ మానవ జన్మ వెతికినా ఇకరాదు
కల్ల సంసారంబు కనుగొంటే ముక్తేరా"2"
మళ్ళీ మానవ జన్మ వెతికినా ఇకరాదు
"భజనంటే నీ కింత చేదా"
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
