50. మనసా...ఓ... మనసా.... హరిచింతనామృతము - Manasara o Manchi manasaa - భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
0 minute read
రాగం: మధ్యమావతి
తాళం: ఏక

సాకి: మనసా...ఓ... మనసా.... హరిచింతనామృతము గ్రోలి
తరించుట నీకు తెలుసా.... తెలియదా.... అయితే..... నా మాట వినవే....ఓ ... మంచి మనసా...

పల్లవి:
హరి అనవే శ్రీ హరి అనవే
శ్రీహరి పాదములే గతి యనవే

1చ:
నిలకడ లేనిది కాయం
అలజడి అయినది ప్రాయం
హరినామృతము దివ్య ఔషధము
అనీషము గ్రోలి తరించవే మనసా
|| హరి అనవే ||
సాకి:
పాప స్వరూపమే దుఃఖము
దుఃఖము కలిగించినదే కామము
సర్వ అనర్థమలకు అది ఏ మూలము
అదే....మూలము....అందుకే

2చ:
మనసు బిగించి మమతడలంచి
మదమత్సర్యము మదమనచి
మనసారా శ్రీహరిని స్మరియించి
భవసాగరమును దాటవే మనసా
|| హరి అనవే ||


లిరిక్స్ పంపినవారు: 
భైరంపల్లి భజన మండలి 
మిడ్జిల్ మండలం - మహబూబ్ నగర్ జిల్లా 


ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat