51. O....Deva.... ఓ...... దేవా... శ్రీ వేంకటేశా రావా ఓ శ్రీనివాసా
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

51. O....Deva.... ఓ...... దేవా... శ్రీ వేంకటేశా రావా ఓ శ్రీనివాసా

P Madhav Kumar
పల్లవి

ఓ...... దేవా.... ఓ.... దేవా.....
దేవా శ్రీ వేంకటేశా రావా ఓ శ్రీనివాసా


చరణం 1

బంగారు శిఖరానా వెలిగేటి దేవా
భక్తుల హృదయాన నిలిచేటి స్వామి
ఏడేడు శిఖరాలు నేనెక్క గలనా
నీ పాద దర్శనమే నే చూడ గలనా "2"
ఓ...... దేవా.... ఓ.... దేవా.....
దేవా శ్రీ వేంకటేశా రావా ఓ శ్రీనివాసా


చరణం 2

నీ నామ స్మరణాలు నిలిపిన చాలు
నిలువెల్లా పులకించు నీ చందనాలు
అనురాగముతో మమ్ము అలరింప వయ్యా
కరిరాజు వరదా మము కాపాడ వయ్యా "2"
ఓ...... దేవా.... ఓ.... దేవా.....
దేవా శ్రీ వేంకటేశా రావా ఓ శ్రీనివాసా


చరణం 3

స్వామివి నీవుండ భయ మేలనయ్యా
ప్రేమతో మము బ్రోవ జాగేల నయ్యా
కామితవరదా కాపాడ వయ్యా
అవతార పురుష మమ్మలరింప వయ్యా "2"
ఓ...... దేవా.... ఓ.... దేవా.....
దేవా శ్రీ వేంకటేశా రావా ఓ శ్రీనివాసా


ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow