నీవైన దయజూడవమ్మ లోకపావని ననుబ్రోవవమ్మ ॥ప॥
యేవ్యాళ్ళ మీ పాద శేవజేసినవారి ।
కావరించి బ్రోవవమ్మ దయాంబుధి ॥నీ॥
తల్లికైన మిక్కిలేరీ కల్పవల్లీవి ధర్మానుసారి |
ముల్లోకములవారు మునిజనాదులెల్ల ॥
కొల్లాలుగా నిన్ను కొనియాడుచుందురు ॥నీ॥
రాముని పట్టంపురాణీ వర రాజిత ఘననీలవేణీ |
నీమాయదెలియ నే నెంతటివాడాను
భామలలామ నానోముఫలము నీవే ॥నీ॥
ఉరమందు నీవున్నవలనా శ్రీధరునకు దయబుట్టు లలనా ।
పరగా మీ చెంగాట భజనజేయుచు నుందు
ధరణి భక్తుల నేలే వరదాయివనుకుందు ॥నీ॥
శరణుజేశెద భూమి తనయా భక్తవరదాయివమ్మ సద్వినయా |
తరుణి మోములపురి ధాముని సతివయ్యి |
ధరణిలో వెంకాటదాసునేలవమ్మ ॥నీ॥
లిరిక్స్ పంపించినవారు:
భైరంపల్లి భజన మండలి
మిడ్జిల్ మండలం - మహబూబ్ నగర్ జిల్లా
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.