పరమేశ్వర నీకు పరిహాసమా
ఈ దేహమున మోహమిదిమోసమా
దయజూపి దరిజేర్చ దిగిరా శివా
పరమేశ్వర నీకు పరిహాసమా....
చినుకు తడిచేయనిదె పుడమి పులకించునా
చినుకు తడిచేయనిదె పుడమి పులకించునా
మొలపోట్లకోర్వకనె శిల శిల్పమాయెన
నేజిక్కినానయ్య నీమాయలో
నేజిక్కినానయ్య నీమాయలో
శిలనౌదునో లేక సిల్పమేయౌవుదునొ బ్రోచేటి భారమిక నీదే శివా...
పరమేశ్వర నీకు పరిహాసమా...
భానుడుదయించగనె కమలములు విరియునా
భానుడుదయించగనె కమలములు విరియునా
నిశిరాజు రాకకై కలువలే వేచెనా
ఏ మర్మమో ఇమిడె ఈ ఉర్విలో
ఏ మర్మమో ఇమిడె ఈ ఉర్విలో
అదిగాంచలేనయా ఈ జన్మలో కరుణించినడిపించు నీ త్రోవలో....
పరమేశ్వర నీకు పరిహాసమా....
