తుమ్మెద ఓ తుమ్మెద ! ఎంత తుంటరోడే గోవిందుడు తుమ్మెద !
ఓ యశోదమ్మ నీ కొడుకు తుమ్మెద ! ఎంత తుంటరోడే గోవిందుడు తుమ్మెద
|తుమ్మెదా|
వెన్న తిన్న నోటితోనే ! మన్ను తింటా ఉన్నాడు (2)
వాని పట్టుకుందాం అంటే వాడు చిక్కడు వాడు !
|తుమ్మెదా|
అల్లరి వాడన్నారు చల్లరివాడు అన్నారు (2)
అల్లరి అంత చేసి వాడు ! అమ్మను ఏడ్పించాడు...
|తుమ్మెదా|
గోవర్ధనగిరి నెత్తి గోవులను కాపాడినాడు (2)
యశోదమ్మ ఇంటిలో ఏ మూలన దాగినాడో...
|తుమ్మెదా|
నారాయణ అవతారం ! శ్రీకృష్ణుని నామాలు (2)
కంసుని అల్లుడంట వాసుదేవుని కొడుకంటా......
|తుమ్మెదా|
ఈ లిరిక్స్ పంపినవారు:
బైరంపల్లి భజన మండలి
మిడ్జిల్ మండలం - మహబూబ్ నగర్ జిల్లా
ఈ పాటను ఎలా పాడాలో ఎక్కడ టచ్ చేసి వినండి.