205. Ayyappa ani pilichina - అయ్యప్ప అని పిలిచిన పలుకవు ఎవరేమన్నారు - అయ్యప్ప స్వామి భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

205. Ayyappa ani pilichina - అయ్యప్ప అని పిలిచిన పలుకవు ఎవరేమన్నారు - అయ్యప్ప స్వామి భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
అయ్యప్ప అని పిలిచిన పలుకవు ఎవరేమన్నారు స్వామి 
నిన్ను ఎవరేమన్నారు స్వామి||2||
పంతం వీడయ్య స్వామి నేను పిలువగా రావయ్య స్వామి ||2||
|| అయ్యప్ప  అని||
స్వామియే శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప ||2||
నల్లని బట్టతో నీ మాల వేసుకొని మండల దినమున కఠిన దీక్షతో
అయ్య నీ నామస్మరణే స్వామి మేము జపించి నామయ్య స్వామి
అయ్య నీ నామస్మరణే స్వామి మేము జపించి నామయ్య స్వామి
పంతం వీడయ్య స్వామి నేను పిలువగా రావయ్య స్వామి
||అయ్యప్ప అని పిలిచిన||
నెత్తిన ఇరుముడి ఎత్తుకొని మేమంతా అందాల కొండకు 
బయలుదేరి నామయ్య నీ శబరి కొండకు బయలుదేరి నామయ్య
నీ నామస్మరణే స్వామి మేము జపించి నామయ్య స్వామి ||2||
స్వాములే మన్నారు స్వామి కన్ని స్వాములేమన్నారు
పంతం వీడయ్య స్వామి నేను పిలువగా రావయ్య స్వామి
||అయ్యప్ప అని పిలిచిన||
స్వామియే శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప ||2||
ఎరిమేలి చేరుకొని పేటతుళ్ళి ఆడుకొని ఆలుదా మేడేక్కీ
అంతేలే అనుకొని
అంతేలే అనుకొని అలసిపోయినామయ్యా
పంతం వీడయ్య స్వామి నేను పిలువగా రావయ్య స్వామి
||అయ్యప్ప అని పిలిచిన||
పంబాకు చేరినాము పంబలోన స్నానమాడి నిశ్చల మనసుతో 
కొండనెక్కి నామయ్య నిశ్చల మనసుతో కొండనెక్కి నామయ్య
దగదగ మెరిసేటి దేవా మా కన్నెమూల గణపతి దేవా ||2||
రూపం చూశాము స్వామి మా వెంటే ఉండయ్య స్వామి
||అయ్యప్ప అని పిలిచిన||
అప్పాచి మేడ పైన నీలిమలై నీడలోన పళనిమలై కొండల్లో 
కొలువుదీరి నావయ్య ఆ ఐదు కొండల్లో కొలువుదీరినావయ్య
నెయ్యాభిషేకం నీకయ్య నీ దివ్య దర్శనం మాకయ్య
పాలాభిషేకం నీకయ్య నీ జ్యోతి దర్శనం మాకయ్య
మము కరుణించయ్యా స్వామి మా జన్మే ధన్యము స్వామి
మమ్ము కరుణించయ్యా స్వామి మా జన్మే ధన్యము ||3||
||అయ్యప్ప అని పిలిచిన||
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow