38. Manoharam mahavaram sriramuni - మనోహరం మహవరం - శ్రీరాముని దర్శనం - శ్రీరామ భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

38. Manoharam mahavaram sriramuni - మనోహరం మహవరం - శ్రీరాముని దర్శనం - శ్రీరామ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

మనోహరం మహవరం - శ్రీరాముని దర్శనం 
సుందరం సుమధురం - రఘురాముని దర్శనం 
వరువలేము మరువలేము ఆ మొహన రూపం 
పావన గోదావరి - పరుగులెత్తి పారగా
॥మనోహరం||
పతిత పావనుని రాముని - పాదాలే కడుగగా 
సీతా రాములే దివ్య - దర్శన మియగా 
జయము మనకు కలుగదా - జన్మలన్ని పండుగా
॥మనోహరం॥
భద్రాచల క్షేత్రమే - కలియుగవైకుంటం 
జయరాముని మంత్రమే - ఈ జన్మకు మొక్షము 
భద్రాది గిరిపైన - వెలసిన కుల దైవమా 
శ్రీరాముని మార్గమే - ఇలకే ఆదర్శము
॥మనోహరం॥


ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow