మనోహరం మహవరం - శ్రీరాముని దర్శనం
సుందరం సుమధురం - రఘురాముని దర్శనం
వరువలేము మరువలేము ఆ మొహన రూపం
పావన గోదావరి - పరుగులెత్తి పారగా
॥మనోహరం||
పతిత పావనుని రాముని - పాదాలే కడుగగా సీతా రాములే దివ్య - దర్శన మియగా
జయము మనకు కలుగదా - జన్మలన్ని పండుగా
॥మనోహరం॥
భద్రాచల క్షేత్రమే - కలియుగవైకుంటం జయరాముని మంత్రమే - ఈ జన్మకు మొక్షము
భద్రాది గిరిపైన - వెలసిన కుల దైవమా
శ్రీరాముని మార్గమే - ఇలకే ఆదర్శము
॥మనోహరం॥
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
