52. Sri Venkateswara Sevintura - శ్రీ వేంకటేశ్వర సేవింతురా - ఓ తిరుమలేశ్వర పాలించరా - వేంకటేశ భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

52. Sri Venkateswara Sevintura - శ్రీ వేంకటేశ్వర సేవింతురా - ఓ తిరుమలేశ్వర పాలించరా - వేంకటేశ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

పల్లవి : 
శ్రీ వేంకటేశ్వర సేవింతురా - ఓ తిరుమలేశ్వర పాలించరా
ఓ... శ్రీనివాసా....ఓ వేంకటేశా... 
 || శ్రీ శ్రీనివాసా ||
చరణం 1: 
ఆ కొండ శిఖరాన నీవుండగా
నీ సన్నిధానము చేరేదెలా
కారుణ్యధామ దరి చేర్చరా
కోనేటి రాయ కనవేమిరా
ఓ శ్రీనివాసా - ఓ వేంకటేశా 
 || శ్రీ శ్రీనివాసా ||
చరణం 2: 
గోవింద గోపాల మదుసూదనా
వినరావ ఈ దీన జన వేదనా
నారాయణా నిను మది వేడినా
ఖగరాజ వాహన ఈ శోధనా
ఓ శ్రీనివాసా - ఓ వేంకటేశా 
 || శ్రీ శ్రీనివాసా ||
చరణం 3: 
నీ ముడుపులే కట్టి తెచ్చామురా
నీ ముంగిటను వేచి యున్నామురా
మురిపించ బోకుర దామోదరా
మమ్మేల రావయ్య జగదీశ్వరా
ఓ శ్రీనివాసా - ఓ వేంకటేశా 
 || శ్రీ శ్రీనివాసా ||
చరణం 4: అలమేలు మంగమ్మ హృదయేశుడా
కలిలోన వెలసేటి ఇలవేల్పుడా
ఇల అప్పాపురమందు వున్నానురా
అప్పన్న దాసుని నన్నేలరా
ఓ శ్రీనివాసా - ఓ వేంకటేశా 
|| శ్రీ శ్రీనివాసా ||



ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow