రఘుకుల తిలకా రా రా - పాట స్టైల్ లో
యదుకుల నందన రారా, నిన్నేత్తి ముద్దులాడెదరా
గోకుల క్రిష్ణా రారా, గోపాల క్రిష్ణా రారా
|| యదుకుల ||
హాయిగ స్నానము చేసి, నువు ఆటలాడుదువు రారాపాలు పెరుగు తాగి, నువు పరుగున బోదువు రారా
|| యదుకుల ||
కాలికి అందెలు కట్టీ, నీ మొలకు గజ్జలు చుట్టీ నడుము పింఛము బెట్టీ, నీ నడుముకు దట్టీ చుట్టీ
|| యదుకుల ||
ఆటలాడుకుంటూ, నువు అల్లరి చేయుట మానిఅల్లరి చేయుట మాని, నువు హాయిగా రారా తనయా
| యదుకుల ||
మురళిని చేతులో పట్టీ, హే మోహన క్రిష్ణా రారామురళీ మోహన రారా, హే మురళీ క్రిష్ణా రారా
|| యదుకుల ||
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
