సాకి
శ్రీశేష శృంగార సుధ లీల. పడ్మేశ సప్తాచల పారిజాత
ఆనంద గోవింద హరే ముకుందా. నమో దేవేశ నమో శ్రీనివాసా
ప్రభో మాం పాహి విభో వెంకటేశా...దేవా... దేవా....దేవా... అ...
పల్లవి
ఎక్కలేను స్వామి ఏడు కొండలు
నే నెక్కలేను స్వామి ఎతైన. కొండలు
చరణం 1
నీ కొండకు వస్తానని మ్రొక్కుకొంటినీ
వచ్చే ఓపిక లేక వేడు కొంటినీ "2"
పాల యుంచినా నీట ముంచినా....ఆ... ఆ....
నీదే భారము స్వామి నిన్నే నమ్మితి తండ్రి "2"
ఎక్కలేను స్వామి ఏడు కొండలు
నే నెక్కలేను స్వామి ఎతైన. కొండలు
చరణం 2
కొండ ఎక్కలేను నీవు కొండ దిగిరావు"2"
ఈ జన్మకు నా మ్రొక్కులు తీరె భాగ్యమే లేదా "2"
నే చేసిన పాప ఫలం ఈజన్మకు ఇంతేనా. ఆ ఆ.. "2"
ఎవరికి చెప్పను స్వామి ఏమని తెలుపనూ
ఎక్కలేను స్వామి ఏడు కొండలు
నే నెక్కలేను స్వామి ఎతైన. కొండలు
చరణం 3
తోడు లేనివాడనూ నీడలేని వాడనూ.
నా కున్నా తోడు నీడ నీవే అనుకుంటినా"2"
దయ చూపవయ్యా తండ్రి దరిచేర్చుకో స్వామి.... "2"
నీ దరిశనం మియ్యవా మా పాపం భాపవా
ఎక్కలేను స్వామి ఏడు కొండలు
నే నెక్కలేను స్వామి ఎతైన. కొండలు
నే నెక్కలేను స్వామి ఎతైన. కొండలు
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
