ప్రణవ స్వరూప రారా - ప్రణుతింతుర శ్రీకర రారా
|| శివ ||
హిమగిరి సదన రారా- ఓ ముని జన వందిత రారాప్రమద గణాధిప రారా- పరమేశ్వర దయగనవేరా
|| శివ ||
ఒదలను విభూతి గంధం - హర దండిగ పూసెదరారాపాలు తేనెలు తెచ్చి - నిన్నఅభిషేకించెద రారా
|| శివ ||
బంతి చామంతిపొగడ - పున్నాగ మల్లియసరులుమెండుగ మాలలు కట్టి - నీమెడలో వేసేదరారా
|| శివ ||
సృష్టి స్థితి లయకారా - శరణాగత వత్సల రారా
సకలము నీవే కదరా - సర్వేశ్వర పాలింపుమురా
సకలము నీవే కదరా - సర్వేశ్వర పాలింపుమురా
|| శివ ||
జగములనేలే స్వామి - ఓ జంగమ దేవర రారా
"జయసిందూరకు" నిరతం - జయమీయగ వేగమే రారా
"జయసిందూరకు" నిరతం - జయమీయగ వేగమే రారా
|| శివ ||
భవభయహరణ రారా - మా భవములు బాపవదేరా
భువిలో అప్పన్నదాసు -మొర నాలింపగ రావేరా
భువిలో అప్పన్నదాసు -మొర నాలింపగ రావేరా
|| శివ ||
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
