ఢమ ఢమ ఢమ ఢమ మ్రోగిందీ...ఢమరుఖ నాదమూ
కైలాసంలో కదిలిందీ... శివుని పాదమూ...
మెడలో నాగు చేసిందీ... చక్కని నాట్యమూ
గంగా భువికి దించిందీ జల జల పాతమూ...
అక్కడ ఇక్కడ శివుడు నీలో నాలో గలడు
అంత నిండిన శివుడు అంతర్యామి అతడు
'' ఢమ ఢమ ఢమ ఢమ''
ఆ వెండి కొండలలో వెలసినావంటాపార్వతమ్మకి ప్రాణంగా నిలిచినావంటా
సాక్షి గణపతి భ్రమరాంభలతో కొలువైనావంటా
శ్రీశైల మల్లేసుడవై కరుణించావంటా...
'' ఢమ ఢమ ఢమ ఢమ''
గరళాన్ని కంఠములో నిలిపినవంటామూడు కల్లతో ముల్లోకాలు గాచినావంటా
శివ శివ శివ శివ అంటే చాలు సిరులిచ్చేవంటా
లయకారుడువై రుద్ర భూమిలో నివసించేవంటా...
'' ఢమ ఢమ ఢమ ఢమ''
అంత నిండిన శివుడు అంతర్యామి అతడు ''2''ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
