నెమలి వాహనమెక్కి తిరిగే బాలుడికి లాలీ......
మురిపాల జోలాలీ..... సురులకే సేనాధిపతి కీ మధురమగు లాలీ.... ముజ్జగములా లాలీ.... పార్వతీ పరమేశ్వర తనయుడు స్వామినాధుడట.... కుమారస్వామి అట.... కృత్తికలు పాలించి పెంచిన కార్తికేయుడట.... ముద్దు బాలుడట.... నిదురకి వేలాయనట.... జోలాలి.... జోలాలి....జోలాలి.... జోలాలి.... జోలాలి....జోలాలి... నెమలి వాహనమెక్కి తిరిగే బాలుడికి లాలీ... మురిపాల జోలాలీ..... సురులకి సేనాధిపతికీ మధురమగు లాలీ..... ముజ్జగముల లాలీ..... శివుని తేజం.. శిశువుగా ఇల వెలసిన కథ నీది.... సర్ప రూపుగా భక్తులను కాపాడు లీల యే నీది..... ఆరు ముఖముల జ్ఞానమూర్తిగా అవతరించేనట..... అన్న గణపతి ముద్దుల తమ్ముడివి నీవు అట.... జోలాలి..... జోలాలి..... జోలాలి... జోలాలి.... జోలాలి...... జోలాలి...దేవతల కాపాడ వెలసిన స్కంద జోలాలి....
సుబ్రహ్మణ్య జోలాలి.....
తారకాసుర వధను చేసిన మురుగ జోలాలి....
శరవణభవకు జోలాలి....
శూలధారీగ దృష్టుదుల శిక్షించి మా స్వామి.......
నీకు జోలాలి....
వల్లీ దేవసేనల ప్రియనాధుడికి లాలీ.....
దేవ జోలాలి....
షణ్ముఖుడ జోలాలి....
జోలాలి..... జోలాలి.....జోలాలి.....
జోలాలి.... జోలాలి..... జోలాలి.....
తల్లి పార్వతి నీకు పాడేను తీయనగు జోలాలి.....
అమ్మ గంగే పాడుతున్నది చల్లని ఒక లాలి.....
ఇహం పరములనీచ్చు గుహుడికి పాడే మరు లాలీ....
పంచభూతములన్నీ పాడెను పరమభక్తితో లాలీ....
జోలాలి.... జోలాలి.... జోలాలి.....
జోలాలి.... జోలాలి..... జోలాలి....
నెమలివాహనమెక్కి తిరిగే బాలుడికి లాలీ....
మురిపాల జోలాలీ....
సురులకే సేనాధిపతి కీ మధురమగు లాలీ...
ముజ్జగముల లాలీ....
పార్వతీ పరమేశ్వర తనయుడు స్వామినాధుడట .....
కుమార స్వామి అట...
కృత్తికలు పాలించి పెంచిన కార్తికేయుడట....
ముద్దు బాలుడట....
నిదురకు వేలాయనట.....
జోలాలి...... జోలాలి...... జోలాలి.....
జోలాలి......జోలాలి....... జోలాలి......
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
