72. హర హర శంభో శంకరా శివ శివ శంభో జటాధరా - Hara Hara shambho - శివ భజన పాటల లిరిక్స్
July 07, 2025
హర హర శంభో శంకరా
శివ శివ శంభో జటాధరా
భుజగ భూషణ ఫాలనేత్ర
శూలధారీ మమ శరణం
పరమ శివా యని పాడేను నాగళం
ముక్కంటి దేవర మహేశ్వర
సృష్టి స్థితిలయ కారకా ఈశ
వేడెదరా నిను గంగాధరా భవ -2
చంద్ర శేఖరా చర్మాంబరుడా
పార్వతి నాథ కదలి రావయ
నీ పాదము సోకి పులకించే ఈ పుడమి
భస్మాంబరా ధారి జగదీశ్వర
కైలాస గిరివాసా పరమేశ్వరా శివ -2
నమో నమో నమః శివాయ
నీల కంటుడా నీలాంబరుడా
లింగ స్వరూపుడ మమ్ము బ్రోవరా
Tags
