అమ్మా రావే రావే రావే ఆదుకోవే దుర్గా భవానీ
ఆదిశక్తి నీవె, అన్నపూర్ణ నీవే.
శారదాంబ నీవే సంతోషి మాత రావవే
లోక మాతా రావే రావే ఆదుకోవే దుర్గా భవానీ
నిన్ను మిన్న లేరు ఈ జగాలెల్ల లోన
జన్మ జన్మలోన నిన్ను కొలిచే దాము
శారాదాంబా రావే రావే ఆదుకోవే దుర్గా భవానీ
నీదు మాయతోనే ఈ పంచభూతము లాయె
మట్టిలొ పుట్టింప జెసి మట్టిలో మరణింపజేసి
జననా మరణాములూ తెలిపినావే ఆది శక్తి దుర్గా భవానీ
ఈ నాలుక చాలదమ్మ నీదు మహిమలెల్ల పొగుడ
క్షణములొ నవ్వింప జేసీ క్షణములొ దుఃఖింప చేసి
జననామరణాములూ తెలిపినావే
లోక మాతా దుర్గాభవానీ.
!! అమ్మా రావే రావే రావే !!
