సాంబ శివా నీదు మహిమ
ఎన్నటికీ తెలియదాయె
హరా హరా శివ శివా
గంగాజలము దెచ్చి నీకు
అభిషేకము సేద్దమంటే
గంగ జలముల చేప కప్పల
యెంగిలంటున్నావు శంభో
హర హర శివ శివా
ఆవుపాలు దెచ్చి నీకు
అభిషేకము చేద్దమంటే ఆవుపాల లేగదూడల
యెంగిలంటున్నావు శంభో
హర హరా శివ శివా
తుమ్మిపూలు దెచ్చి నీకు
తుష్టుగ పూజింతు నంటే
కొమ్మ కొమ్మన కోటి తుమ్మెద
లెంగిలంటున్నావు శంభో
హర హరా శివ శివా
నారికేళము దెచ్చి నీకు
నైవేద్యము సేద్దమంటే
అప్పుడు బహు యిష్టము అంటివి శంభో
హర హర శివ శివా
73. సాంబ శివా నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయె - sambha Shiva Needu Mahima - శివ భజన పాటల లిరిక్స్
July 08, 2025
Tags
