ఓంకార ప్రణవ స్వరూపా శ్రీ నీల కంఠ సర్వేశ్వరా
భజింతును నిన్ను సకలా ధారా సర్వం నీవే సదాశివా
పల్లవి:
హర ఓం నమశ్శివాయ జయ ఓం నమశ్శివాయ
హర హర శంకర గౌరీ శంకర భక్తవ శంకర సదా శివా
మహేశ్వరాయ మహాదేవాయ మల్లిఖార్జున సదాశివా
కాల కాలాయ మృత్యుంజయాయ శ్రీ నీలకంఠ సదా శివా
సామ ప్రియాయ సాధు రూపాయ సర్వేశ్వరాయ సదాశివా
తకధిమి తకధిమి తాండవ రూపా ప్రమథ నాథ శ్రీ నటరాజ
శశి శేఖరాయ శివ శంకరాయ త్రిశూల ధారీ సదాశివా
వీర భద్రాయ కాల గమనాయ దిగంబరాయా సదాశివా
విశ్వేశ్వరాయ విరూపాక్షాయ విజయ ప్రధాత సదా శివా
తకధిమి తకధిమి తాండవ రూపా ప్రమధ నాధ శ్రీ నటరాజా
విశ్వనాధాయ గౌరీ ప్రియాయ గౌరీ శంకర సదాశివా
నంది వాహనా నాగా భరణా కైలాస వాస సదాశివా
సోమ నాధాయ సర్వేశ్వరాయ శ్రీ నీలకంఠ సదాశివా
తకధిమి తకధిమి తాండవ రూపా ప్రమధ నాధ శ్రీ నటరాజ
|| హర ఓం నమఃశివాయ ||
