హర హర శంకరా భోళా శంకరా
శివ శివ శంకరా నీల కంఠుడా
పరమేశ్వరా జగదీశ్వరా
జంగమ దేవర జగతికే నీవయ్యా
తలపైన గంగమ్మ మెడలోన నాగన్న
జడపైన చంద్రన్న తోడుగ నీపార్వతమ్మ
పులి చర్మాంబరమే ధరియించిన వాడా
పశుపతి నాథ మము పాలింపవ -2
తల్లి తండ్రి లేరంట జననమేమొ తెలియదంట
ఒళ్ళంతా బూడిదంట స్మశానమే వాసమంట
ముక్కంటి ఈశ్వరుడా ముక్తిని నొసగుమురా
మహ దేవా నిన్నే మరిమరి వేడితిరా.. 2
హరహర శంకరా
