76. ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా - Avariki Avaraiah Eeshwara - శివ భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

76. ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా - Avariki Avaraiah Eeshwara - శివ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా
ఎవరుంటే నేమయ్య శంకర
మరు జన్మ రాకుండ చూడరా
నీ దయ ఉంటె చాలురా ఈశ్వరా
నీ దయ ఉంటే చాలు పరమేశ్వరా

ఈ కనులు తెరువగా జననం
ఈ కనులు మూస్తేనె మరణం
రెప్ప పాటయ్య ఈ జీవనం
విధి మార్చ తరమా బ్రహ్మకైన
పరమేశ్వరా...ఆ...ఆ...ఆ.
పరమేశ్వరా కరుణించ రావా
హర హరా మహాదేవ శంభో శంకర

నేనూ నేననే అహము
నాది నాదనే స్వార్థమూ
కలుషితంబయ్యె ఈ జీవితం
ఇక చాలునయ్యా ఈ నాటకం
లయ కారకా… ఆ….ఆ….ఆ
లయ కారకా ఇక చాలికా
అర్ధనారీశ్వరా గౌరీ శంకరా

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow