పల్లవి॥ రాముడే నాదైవము.
భద్రాచల రాముడే నాదైవము
రామ నామమే నా గానమూ
రామ నామమే నా ధ్యానమూ
రామ నామమే నా ప్రాణమూ
రామ నామమే జీవనమూ
పరమ శివుడు కా పార్వతి దేవికి
ప్రబోధించిన పావన నామము
పరము యోగులా హృదయ కమలమున
ప్రతిధ్వనించెడి ప్రణవ నాదము -3!! రాముడె!!
రామ నామమే ఘోరాఘ హరణము
రామ నామమే భవజలధి తరణము
రామ నామమే వాల్మీకి స్మరణము
రామ నామమే శబరి కి శరణము!! రాముడే!!
అండ పిండ బ్రహ్మాండమంతట
నిండి యున్నట్టి అఖండ నామము
దండపాణి కే దండపాణి కోదండ పాణి
ఉద్ధండ నామము
సీతారాం సీతారాం సీతారాం జయ సీతారాం
సీతారాం సీతారాం సీతారాం జయ సీతా
!! రాముడే నాదైవము !!
