ఓం శబరి గిరీశాయనమః ఓం భూలోక నాయకాయనమః
ఎందెందు ఎంచిచూచినా అందుదు అయ్యప్పా
దీక్షతో స్వాములైనవారు అందరూ ఇక అయ్యన్ అయ్యప్పన్లే
భూలోక నాయకా గురుస్వామి
||ఎందెందు||
నీ తల్లి తలనొప్పి ప్రాణాంతకంచిరుత పులి పాలే జీవానికి సంజీవిని
అని తెలిసి చిననాడే దీక్షబూని
కారడవుల్లో ఇరుముడితో సంచరించి
కామం పెనుక్రోధం కడులోభం మదమాత్సర్యం మోహం
అవినీతి కలమహిషిని కడతేర్చితివి
భళా భళీ భళీ! పరాక్రమం భళీ!
పులిమీదనె ఇల చేరిన స్వామి మణికంఠా
||ఎందెందు||
కాల ప్రవాహంలా సాగేరులేనీలాంబర ధారులైన నీభక్త సమూహం
పలువన్నెల ఇరుముల్లా ఇంద్రా ధనుస్సే
మావర్ణాలైక్యతను సూచించేకాదా
శిలలే సిరివిరులై పదగమనం గతి సుకుమారం
మననం నీస్మరణం తవ చరణం మాకారాధ్యం
హరి హరా పుత్రా! ఈ ధరాతలం పొంగే!
భక్తిరసం జాలు వారె మాహృదిలో స్వామి
|| ఎందెందు ||
