04. నవరాత్రులు: శరన్నవరాత్రులు - శ్రీ కాత్యాయనీ దేవి | Sri Kathyayani devi | Navaratri
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

04. నవరాత్రులు: శరన్నవరాత్రులు - శ్రీ కాత్యాయనీ దేవి | Sri Kathyayani devi | Navaratri

P Madhav Kumar

శరన్నవరాత్రి మహోత్సవాల్లో నాలుగో రోజున శ్రీ కాత్యాయనిదేవిగా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దర్శనమిస్తారు.


పూర్వం కాత్యాయన అనే మహర్షి ఉండేవాడు. ఆ మహర్షి ఆదిపరాశక్తి కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా అమ్మవారే తన కుమార్తెగా జన్మించాలని వరం కోరుకుంటాడు.


మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ దేవుని గురించి కఠోర తపస్సు చేసి మృత్యువు లేకుండా వరం కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు మృత్యువు లేకుండా వరం ఇవ్వడం కుదరదు ఇంకేమైనా కోరుకోమంటాడు. అందుకు మహిషాసురుడు కేవలం స్త్రీ చేతుల్లో మాత్రమే మరణం పొందేలా వరం పొందుతాడు. స్త్రీలు బలహీనులుగా, కేవలం బానిసలుగా చూసే మహిషాసురుడు ఇక తనకు మరణంలేదని, వర గర్వంతో సమస్తలోకాలను పీడిస్తూ ఉంటాడు. మహిషాసురుడి ఆగడాలు భరించలేక సమస్త దేవతలు కలిసి త్రిమూర్తులను శరణువేడుతారు.



🍃🌷మహిషాసురుడి జననం:


ఒకానొకప్పుడు రంభసురుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. ఒకసారి మహిషిని చూసి మోహించి వివాహమాడతాడు, వారి సంతానమే మహిషాసురుడు. మహిషాసురుడు మనిషిలా, మహిషిల మారగల శక్తి ఉన్నవాడు.


మహిషాసుర సంహారం కోసం అమ్మవారు కాత్యాయన మహర్షి ఇంట జన్మిస్తుంది. కాత్యాయన మహర్షిని తండ్రిగా స్వీకరించింది, కనుక కాత్యాయని అనే నామంతో అమ్మవారిని పిలుస్తారు.


ఒక రోజు చండ్, ముండ్ అనే ఇద్దరు రాక్షసులు అత్యంత సౌందర్యరాశి అయిన, వెలిగిపోతున్న కాత్యాయనీ దేవిని చూసి, ఆమె అందానికి అచ్చెరువునొంది, ఆమె సౌందర్యం గురించి వాళ్ల రాజు అయిన మహిషాసురుడికి చెప్తారు. వెంటనే మహిషాసురుడు దుందుభి అనే దూతను కాత్యాయనిదేవి వద్దకు వివాహ ప్రస్తావన పంపుతాడు. దుందుభి ఎలాగైనా ప్రలోభపెట్టి ఆ స్త్రీని వివాహానికి ఒప్పించాలని తమ రాజు గురించి, త్రిలోకాధిపత్యం గురించి, ఇంకా అతని ఐశ్వర్యం గురించి చాలా గొప్పగా చెబుతాడు.


అప్పుడు కాత్యాయనిదేవి నవ్వి మా వంశం లో ఒక ఆచారం ఉంది, ఎవరైతే నన్ను యుద్ధంలో ఓడిస్తారో వారిని మాత్రమే నేను వివాహం చేసుకుంటాను అని చెప్తుంది. ఆ సమాచారాన్ని దుందుభి మహిషాసురుడు కి చెప్తాడు. ఇక మహిషాసురుడు స్త్రీ కింత అహంకారమా, స్త్రీని జయించడం ఎంతసేపు, యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్తాడు.


మహిషాసుర, కాత్యాయనిదేవి యుద్ధం గురించి తెలుసుకున్న దేవతలు దేవ సైన్యాన్ని తీసుకొని అమ్మవారి దగ్గరికి వస్తారు. ఈ అవతారంలో అమ్మ 18 చేతులతో, మూడు నేత్రాలతో, వేయి సూర్య కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. దేవతలు తమ తమ ఆయుధాలను కూడా అమ్మవారికి ప్రసాదిస్తారు. విష్ణుమూర్తి తన చక్రాన్ని, శివుడు తన త్రిశూలాన్ని, వరుణదేవుడు శంఖాన్ని, వాయువు విల్లుని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, బ్రహ్మదేవుడు కలశాన్ని, కమలాన్ని ఇలా వివిధ ఆయుధాలను ఇస్తారు. అమ్మవారు సింహవాహినియై, దేవ సైన్యం వెంటరాగా మహిషాసురుడితో యుద్ధానికి తరలి వెళుతుంది.


మొదట దుందుభి తర్వాత చండ్, ముండ్, శుంభ నిశుంభలను వధించగా, ఇక మహిషాసురుడే యుద్ధానికి వస్తాడు. మహిషిగా, అసురుడిగా రూపాలను మారుస్తూ అమ్మవారి తో యుద్ధం చేస్తాడు. మహిషిగా మారినప్పుడు అమ్మ, వాడి పృష్టభాగం అధిరోహించి త్రిశూలం తో పొడిచి కత్తితో తల నరికివేస్తుంది. మహిషాసురుని వధించింది కనుక అమ్మవారిని మహిషాసురమర్దిని అనే నామంతో కూడా పూజిస్తారు. చాలా ప్రాంతాలలో అమ్మవారి విజయానికి ప్రతీకగా దుర్గా పూజ చేస్తుంటారు.


కాత్యాయని దేవి ఉపాసన వల్ల సాధకులకు ఆరవ చక్రం అనగా ఆజ్ఞా చక్రం ఉత్తేజితమవుతుంది. ఆజ్ఞా చక్రం ఉత్తేజితం అవ్వడం వల్ల సాధకుల లో నిక్షిప్తం అయి ఉన్న జ్ఞానం ప్రకాశిస్తుంది.


ద్వాపరయుగంలో గోకులంలోని గోపికలంతా కృష్ణుని భర్తగా పొందడం కోసం కాత్యాయని దేవి వ్రతం చేస్తారు. పెళ్ళికాని కన్యలు మార్గశిర మాసంలో వ్రత నియమాలను అనుసరించి కాత్యాయని వ్రతం చేసుకుంటే మంచి భర్త లభిస్తాడని ప్రతీతి.


♦️అలంకరించే చీర రంగు: ఎరుపు

♦️అర్చించే పూల రంగు: ఎరుపు

♦️నైవేద్యం: బెల్లం అన్నం, అన్నం ముద్దపప్పు



🍃🌷ధ్యాన శ్లోకం:


చన్ద్రహసోజ్జ్వలకర శార్ధూల వరవాహన

కత్యయని సుభమ్ దద్యాద్ దేవి దానవఘాటిని




🌷స్తుతి:


యా దేవీ సర్వభూ‍తేషు మాఁ కాత్యాయనీ రూపేణ సంస్థితా।
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః॥



ఓం కాత్యాయనీ మహామాయే, మహాయోగిన్యాధీశ్వరీ।
నాంద్ గోప్సూతత్ దేవి పాటిమ్ మే కురు తే నమః॥ 1



హే గౌరీ! శంకర్అర్ధాంగి! యధా త్వాం శంకర ప్రియా।
తథా మమ కురు కల్యాణి కంటకం సుదుర్లభం॥ 2


హే గౌరీ! శంకర్అర్ధంగిని! యథా త్వం శంకర ప్రియ।
తథా కమ్ కురు కల్యాణి కంత్ కాంత్ సుదుర్లభమ్॥ 3


ఓం దేవేంద్రని నమస్తుభ్యం! దేవేంద్ర ప్రియ భీమిని।
వివాహం భగ్యం ఆరోగ్యశ్రీ షిఘ్రా లాభమ్ చ దేహి మే॥ 4


ఓం షంగ్శంకరాయ సకల్జన్మర్జీత్ పాప్విధ్వామ్స్నాయ్।
పురుషార్ద్చౌతుస్టాయ్ లాభయ్చ పాటిమ్ మే దేహి కురు కురు స్వాహ॥ 5



శ్రీ కాత్యాయనీ అష్టోత్తర శతనామావళి

  1. ఓం కల్యాణ్యై నమః
  2. ఓం త్రిపురాయై నమః
  3. ఓం బాలాయై నమః
  4. ఓం మాయాయై నమః
  5. ఓం త్రిపురసుందర్యై నమః
  6. ఓం సుందర్యై నమః
  7. ఓం సౌభాగ్యవత్యై నమః
  8. ఓం క్లీంకార్యై నమః
  9. ఓం సర్వమంగళాయైనమః
  10. ఓం హ్రీంకార్యై నమః
  11. ఓం స్కందజనన్యై నమః
  12. ఓం పరాయై నమః
  13. ఓం పంచదశాక్ష్యే నమః
  14. ఓం త్రిలోక్యమోహనాధీశాయై నమః
  15. ఓం సర్వాశాపూరవల్లభాయై నమః
  16. ఓం సర్వసంక్షోభణాధీశాయై నమః
  17. ఓం సర్వసౌభాగ్య వల్లభాయై నమః
  18. ఓం సర్వార్థసాధకాధీశాయై నమః
  19. ఓం సర్వారక్షకారాధిపాయై నమః
  20. ఓం సర్వరోగహరాధీశాయై నమః
  21. ఓం సర్వసిద్ధి ప్రదాధిపాయై నమః
  22. ఓం సర్వానందమయాధీశాయై నమః
  23. ఓం యోగినీచక్రనాయికాయై నమః
  24. ఓం భక్తానురక్తాయై నమః
  25. ఓం రక్తాంగై నమః
  26. ఓం శంకరార్థశరీరణ్యై నమః
  27. ఓం పుష్పబాణేక్షుకోదండ నమః
  28. ఓం పాశాంకుశకరాయై నమః
  29. ఓం ఉజ్జ్వలాయై నమః
  30. ఓం సచ్చిదానందలహ్యై నమః
  31. ఓం శ్రీవిద్యాయై నమః
  32. ఓం పరమేశ్వర్యై నమః
  33. ఓం అనంగకుసుమోద్యానాయై నమః
  34. ఓం చక్రేశ్యై నమః
  35. ఓం భువనేశ్వర్యై నమః
  36. ఓం గుప్తాయై నమః
  37. ఓం గుప్తతరాయై నమః
  38. ఓం నిత్యాయై నమః
  39. ఓం నిత్యక్లిన్నాయై నమః
  40. ఓం మదద్రవాయై నమః
  41. ఓం మోహిన్యై నమః
  42. ఓం పరమానందదాయై నమః
  43. ఓం కామేశ్యై నమః
  44. ఓం తరుణీకలాయై నమః
  45. ఓం కలావత్యై నమః
  46. ఓం భగవత్యై నమః
  47. ఓం పద్మరాగకిరీటికాయై నమః
  48. ఓం రక్తవస్త్రయై నమః
  49. ఓం రక్తభూషాయై నమః
  50. ఓం రక్తగంధానులేపనాయై నమః
  51. ఓం సౌగంధికకలసద్వేణ్యై నమః
  52. ఓం మంత్రిణ్యై నమః
  53. ఓం తంత్రరూపిణ్యై నమః
  54. ఓం తత్వమధ్యై నమః
  55. ఓం సిద్ధాంతపురవాసిన్యై నమః
  56. ఓం శ్రీమత్యై నమః
  57. ఓం చిన్మమయ్యై నమః
  58. ఓం దేవ్యై నమః
  59. ఓం కౌళిన్యై నమః
  60. ఓం పరదేవతాయై నమః
  61. ఓం కైవల్యరేఖాయై నమః
  62. ఓం వశిన్యై నమః
  63. ఓం సర్యైశ్వర్యై నమః
  64. ఓం సర్వమాతృకాయై నమః
  65. ఓం విష్ణుస్వస్తే నమః
  66. ఓం వేదమథ్యై నమః
  67. ఓం సర్వసంతత్ ప్రదాయన్న్యై నమః
  68. ఓం కింకరీభూత గీర్వాణ్యై నమః
  69. ఓం సుధావాపీ వినోదిన్యై నమః
  70. ఓం మణిపురసమాసీనాయై నమః
  71. ఓం అనాహతాబ్ద నివాసిన్యై నమః
  72. ఓం విశుద్ధచక్రనిలయాయై నమః
  73. ఓం ఆజ్ఞాపద్మనివాసిన్యై నమః
  74. ఓం అష్టత్రిశత్ కలామూల్యై నమః
  75. ఓం సుషుమ్నా ద్వారమధ్యగాయై నమః
  76. ఓం యోగీశ్వరమనోధ్యేయాయై నమః
  77. ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః
  78. ఓం చతుర్భుజాయై నమః
  79. ఓం చంద్రచూడాయై నమః
  80. ఓం పురాణాగమరూపిణ్యై నమః
  81. ఓం ఓంకార్యై నమః
  82. ఓం విమలాయై నమః
  83. ఓం విద్యాయై నమః
  84. ఓం పంచబ్రహ్మరూపిణ్యై నమః
  85. ఓం భూతేశ్వర్యై నమః
  86. ఓం భూతమద్యై నమః
  87. ఓం పంచాశత్ పీఠరూపిణ్యై నమః
  88. ఓం షోడాన్యాసమహారూపాయై నమః
  89. ఓం కామాక్షే నమః
  90. ఓం దశమాతృకాయై నమః
  91. ఓం ఆధారశక్తేయై నమః
  92. ఓం అరుణాయై నమః
  93. ఓం లక్ష్మై నమః
  94. ఓం త్రిపురభైరవ్యై నమః
  95. ఓం రహఃపూజాసమాలోలాయై నమః
  96. ఓం త్రికోణ మధ్య నిలయాయై నమః
  97. ఓం బిందుమండల నిలయాలై నమః
  98. ఓం వసుకోణపురావాసాయై నమః
  99. ఓం దశార్ద్వయవాసిన్యై నమః
  100. ఓం చతుర్దశారచక్రస్తాయై నమః
  101. ఓం వసుపద్మనివాసిన్యై నమః
  102. ఓం స్వరాబ్జపత్రనివాసిన్యై నమః
  103. ఓం వృత్తత్రయనివాసిన్యై నమః
  104. ఓం చతురస్త్ర స్వరూపాస్యాయై నమః
  105. ఓం నవచక్ర స్వరూపణ్యై నమః
  106. ఓం మహానిత్యాయై నమః
  107. ఓం విజయాయై నమః
  108. ఓం కాత్యాయణ్యై నమః

 || శ్రీ కాత్యాయనీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||

శ్రీమాత్రే నమః….🙏🙏

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow