Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

104. జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మి - Jayalakshmi Varalakshmi Lyrics in Telugu

 జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి

ప్రియురాలవై హరికిఁ బెరసితివమ్మా


పాలజలనిధిలోని పసనైన మీఁగడ

మేలిమి తామెరలోని మించువాసన

నీలవర్ణునురముపై నిండిన నిధానమవై

యేలేవు లోకములు మమ్మేలవమ్మా


చందురుతోడఁ బుట్టిన సంపదల మెఱుఁగవో

కందువ బ్రహ్మలఁ గాచేకల్పవల్లివో

అందిన గోవిందునికి అండనే తోడునీడై

వుందానవు మాఇంటనే వుండవమ్మా


పదియారు వన్నెలతో బంగారు పతిమ

చెదరని వేదముల చిగురుఁబోడి

యెదుట శ్రీవేంకటేశునిల్లాలవై నీవు

నిధుల నిలిచేతల్లి నీవారమమ్మా


📢 Follow