106. జగజ్జనని (Jagajjanani) నల్లటి రూపంలో మాంకాళి |సాంగ్ లిరిక్స్, మంగ్లీ (Mangli) అమ్మవారి భజన పాటల లిరిక్స్
September 12, 2025
నల్లటి రూపంలో మాంకాళి
ఎర్రటి కన్నుల కాళివే
సల్లని సూపుల మాతవే
త్రిమూర్తులైన నీ బిడ్డలమ్మ
ముల్లోకాలకు తల్లివే మమ్ముగాసేవే
దుష్టుల చెండాడే దుర్గమ్మ
శరణు కోరితే అమ్మవే
వరములిచ్చే రాణివే
దిక్కు నీవంటూ వేడేము అమ్మ
దండి దేవివి నీవే… దయను జూపించే
మెడలో కంకలాలలా మాలలు ఉన్న
శాంకారీ దేవి నీవేనమ్మా
శూలం ఎత్తినవమ్మా శుంకల దేవి
భూగోళం నీ చేతిలో బొమ్మ
బ్రహ్మాండంలోన భ్రమరాంబిక
సృష్టికే అందానివే… సృష్టి నీవేలే
నీ కలలను జూపించవే ఓ కనకదుర్గ
విజయాలే ఇయ్యవే… మా కష్టాలే కొయ్యవే
సింహవాహిని నీవే మాతంగివే
పతిత పావని ప్రచండిరా
సుందర మీనాక్షివే శృంగేరివే
వాత్సల్యాన వారాహివే
శక్తికంతటికి మూలపుటమ్మ
ఉగ్రరూపిణివే అమ్మ… ఉనికి నీవేనే
శాంతస్వరూపిణి శీతల దేవి
చాముండేశ్వరివే తల్లి చల్లగ జూడమ్మా
చక్రధారివి నీవే శ్రీ చక్రాన
కొలువై ఉన్న ఇలవేల్పువే
కుంకుమ సిందూరాల సుందరివమ్మా
పసుపురంగుల పసిడి బొమ్మ
మంచు కొండల్లో వైష్ణవిదేవి
అగ్ని రూపిణివే మాత… అభయం నీవేనే
కొంగుబంగారం నీవే రుద్రాణి
అణువులో నీవే అమ్మ విశ్వమే నీదే
Tags
