చంద్రగ్రహణం🌚 7 సెప్టెంబర్ 2025 చంద్రగ్రహణం* గురించి పూర్తి వివరణను ఇక్కడ సమగ్రంగా ఇవ్వడం జరిగినది. Lunar Eclipse
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

చంద్రగ్రహణం🌚 7 సెప్టెంబర్ 2025 చంద్రగ్రహణం* గురించి పూర్తి వివరణను ఇక్కడ సమగ్రంగా ఇవ్వడం జరిగినది. Lunar Eclipse

P Madhav Kumar


*సమయం తీసుకుని చదవండి... తప్పకుండా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి  పూర్తి వివరణ ఉంది...🙏🙏*


*చంద్ర గ్రహణ విశేషాలు*

*తేదీ:* 7 సెప్టెంబర్ 2025 ఆదివారం

*తిథి:* భాద్రపద పౌర్ణమి

*నక్షత్రం:* శతభిషము, పూర్వాభాద్ర, 

*రాశి:* కుంభరాశి

*గ్రహణం రకం:* రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం...

భారతదేశంలో మొత్తం ఈ గ్రహణం స్పష్టంగా కనబడుతుంది. 


*గ్రహణ కాలమానం🌔...*

*స్పర్శ (ప్రారంభం):* రాత్రి 9:57

*సంపూర్ణ గ్రహణ ప్రారంభం:* రాత్రి 11:00

*మధ్యకాలం:* రాత్రి 11:41

*విడుపు ప్రారంభం:* రాత్రి 12:22 (8వ తేదీ)

*ముగింపు:* ఉదయం 1:26 (8వ తేదీ)


*పుణ్యకాలం:* 3 గంటలు 29 నిమిషాలు

*సంపూర్ణ బింబ దర్శనం:* 1 గంట 22 నిమిషాలు bcv


*రాశులపై ప్రభావం...*

*ప్రతికూల ప్రభావం కలిగే రాశులు:*

వృషభ, మిథున, కర్కాటకము, సింహ, కన్య, తుల,

మకర, కుంభ, మీన

వీరు మహాశివారాధన శివాభిషేకం  చేయడం, ఉపవాసం, జపం చేయడం మంచిది.

శివారాధన [ శివనామ జపం ]

అని ఆ పరమేశ్వరుని,విష్ణుమూర్తి నామ జపము మంచిది.


 *ఈ కింది  రాశులు శుభం అని ఉన్న రాశులు  దానం చేయవలసిన అవసరం లేదు హాని అని ఉన్న రాశుల వారు దానం చేయాలి నక్షత్ర వివరణ కోసం మరియు క్రింద చూడండి..* 


1. *మేష~* ధన లాభం {శుభం}

2. *వృషభం~* వ్యధ {హాని}

3. *మిధునం~* చింత {హాని}

4. *కర్కాటకం~* సౌఖ్యం {శుభం

5. *సింహం~* స్త్రీ కష్టం {హాని}

6. *కన్య~* అతి కష్టం {హాని}

7. *తుల~*  మాన నాశనం {హాని}

8. *వృశ్చికం~* సుఖం {శుభం

9. *ధనస్సు~* లాభం {శుభం

10. *మకరం~*  వ్యయం {హాని}

11. *కుంభం~*  ఘాతం {హాని}

12. *మీనం~* హాని {ఘాతం}


శుభం అని రాసివున్న వారికి ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు.

1. మేష~ ధన లాభం {శుభం}

 అశ్విని  1,2,3,4 పాదాలు

 భరణి 1,2,3,4 పాదాలు

 కృత్తిక 1 పాదం

 దానం ఇవ్వాల్సిన అవసరం లేదు. 


2. వృషభం~ వ్యధ {హాని}

 కృత్తిక  2,3,4 పాదాలు

 రోహిణి 1,2,3,4 పాదాలు

 మృగశిర 1,2 పాదాలు

 దానం ఇవ్వాలి.


3. మిధునం~ చింత {హాని}

 మృగశిర 3,4 పాదాలు

 ఆరుద్ర1,2,3,4 పాదాలు

 పునర్వసు1,2,3 పాదాల వారు

దానం ఇవ్వాలి.


4. కర్కాటకం~ సౌఖ్యం {శుభం

 పునర్వసు 4 పాదం

 పుష్యమి1,2,3,4 పాదాలు

 ఆశ్లేష 1,2,3,4 పాదాల వారు

దానం ఇవ్వాల్సిన అవసరం లేదు. 


5. సింహం~ స్త్రీ కష్టం {హాని}

 మఖ 1,2,3,4 పాదాలు

 పుబ్బ 1,2,3,4 పాదాలు

 ఉత్తర 1 పాదాల వారు 

దానం ఇవ్వాలి.


6. కన్య~ అతి కష్టం {హాని}

 ఉత్తర 2,3,4 పాదాలు

 హస్త  1,2,3,4 పాదాలు

 చిత్త  1,2 పాదాల వారు

దానం ఇవ్వాలి.



7. తుల~  మాన నాశనం {హాని}

 చిత్త 3,4 పాదాలు

 స్వాతి 1,2,34 పాదాలు

 విశాఖ1,2,3 పాదాల వారు

దానం ఇవ్వాలి.


8. వృశ్చికం~ సుఖం {శుభం

 విశాఖ 4 పాదం

 అనురాధ1,2,3,4 పాదాలు

 జేష్ఠ  1,2,3,4 పాదాల వారు

దానం ఇవ్వాల్సిన అవసరం లేదు. 


9. ధనస్సు~ లాభం {శుభం

 మూల 1,2,3,4 పాదాలు

 పూర్వాషాడ1,2,3,4 పాదాలు

 ఉత్తరాషాడ 1 పాదం వారు

దానం ఇవ్వాల్సిన అవసరం లేదు.


10. మకరం~  వ్యయం {హాని}

 ఉత్తరాషాడ 2,3,4 పాదాలు

 శ్రవణం 1,2,3,4 పాదాలు

 ధనిష్ట 1,2 పాదాలు

దానం ఇవ్వాలి.


11. కుంభం~  ఘాతం {హాని}

 ధనిష్ట 3,4 పాదాలు

 శతభిషం  1,2,3,4 పాదాలు,

 పూర్వాభాద్ర  1,2,3 పాదాల వారు

దానం ఇవ్వాలి.


12. మీనం~ హాని {హాని}

 పూర్వభద్ర  4 పాదం

 ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదాలు

 రేవతి 1,2,3,4 పాదాల వారు

 దానం ఇవ్వాలి. 


(ఆధ్యాత్మిక భావాలు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ గ్రహణము రోజున, దైవ జపం, దానము చేయుట మంచిది)

      

*దాన సామాగ్రి*

రజిత ( వెండి చంద్ర, నాగబింబములు)

 తెల్లటి వస్తువులు, తెల్ల వస్త్రము, బియ్యము 1.1/4 kg


నీలంవస్త్రము, మినపగుండ్లు 1.1/4 kg,

తమలపాకులు, వక్కలు, ఏవైనా పళ్ళు 

తాంబూలాది దక్షిణలు 

స్వయంపాకానికి వస్తు సామాగ్రి అన్నీ కలిపి బ్రాహ్మణులకు మీ పేరు,గోత్రములు చెప్పి దానముగా ఇవ్వండి. 


*ఆలయములలో పాటించే విధానం*

*గ్రహణానికి ముందు:* సెప్టెంబర్ 7న మధ్యాహ్నం  లోపు అన్ని దేవాలయాల్లో నివేదనలు సమర్పించి, ఆలయ ద్వారాలు మూసి వేస్తారు. సాయంకాల దర్శనం

 ఉండదు. (శ్రీకాళహస్తి దేవాలయంలో ఈ నియమాలు వర్తించవు.)


*గ్రహణం తరువాత:* సెప్టెంబర్ 8 ఉదయం ఆలయాన్ని మొత్తం కడిగి శుభ్రం చేసి గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య సంస్కారం చేసి, విగ్రహాలకు అభిషేకాలు చేసి భక్తులకు దర్శనం ఇవ్వబడుతుంది.


*ఆచారాలు (గ్రహణ రోజున)...* 

తద్దినాలు పెట్టుకోవాలనుకునే వారు మధ్యాహ్నం 1:20 లోపు పెట్టుకోవాలి.


గ్రహణ కాలంలో స్నానాలు, ఉపవాసం,దైవనామ స్మరణ, మంత్రజపం,దానధర్మాలు చేయాలి.


గర్భిణీ స్త్రీలు, పిల్లలు జాగ్రత్తలు పాటించాలి (కత్తెర, సూది పనులు చేయరాదు, అసలు బయటకు వెళ్లరాదు).


మొత్తానికి 7 సెప్టెంబర్ 2025 చంద్రగ్రహణం భారతదేశంలో పూర్తిగా దర్శనమయ్యే అరుదైన గ్రహణం, ఇది కొందరికి ఆధ్యాత్మిక పరంగా శ్రేయస్కరమైతే,  

*విశాఖ*

*శతభిషం* 

*పూర్వాభాద్ర* నక్షత్రాల వారికి శాంతి జపాలు అవసరం.


*🌔గ్రహణ🌒 సమయమును మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి..??*

*చంద్రగ్రహణే యస్మిన్ యామే గ్రహణం, తస్మాత్ పూర్వం ప్రహరత్రయం న భుంజీత.*

*సూర్యగ్రణేతు ప్రహర చతుష్టయం. చంద్రగ్రహేతు యామాం స్త్రీన్ బాలవృద్ధాతురైర్వినా.*

*బాలవృద్ధాతురాణాం తు గ్రహణ యామాత్పూర్వమేక యామో నిషిద్ధః* 


 *చంద్రగ్రహణమందు, గ్రహణం ముందు మూడు ప్రహరలు ( ఒక ప్రహర = 48నిముషములు )లో భోజనం చెయ్యరాదు.* సూర్యగ్రహణానికి ముందు నాలుగు ప్రహరలులో భోజనం చెయ్యరాదు. కానీ *ఇది చిన్నపిల్లలకు, ముసలివారికి, స్త్రీలకు, అనారోగ్యుల విషయంలో వర్తించదు. వారు ఒక ప్రహర ముందు భుజించవచ్చును.*


*సంధ్యాకాలే యదా రాహుః గ్రసతే శశిభాస్కరౌ తదహర్నైవ భుంజీత రాత్రావపి కదాచన.*

*సాయం సంధ్యాయాం సూర్యగ్రస్తే పూర్వే౬హ్ని రాత్రౌ చ న భోక్తవ్యం.*

*అహోరాత్రం న భోక్తవ్యం చంద్రసూర్యగ్రహో యదా ముక్తిం దృష్ట్వాతు భోక్తవ్యం స్నానం కృత్వా తతఃపరమ్.*


 సంధ్యాసమయంలో రాహువు / కేతువు ద్వారా చంద్రుడు లేదా సూర్యగ్రహణం జరిగితే, ఆ పగలు, రాత్రి కూడా భోజనం చెయ్యకూడదు. తరువాతి రోజు శుద్ధబింబాన్ని చూసి, స్నానాదులు చేసుకుని భోజనం చెయ్యాలి. 


*సర్వేషామేవ వర్ణానాం సూతకం రాహు దర్శనే స్నాత్వా కర్మాణి కుర్వీత శృతమన్నం వివర్జయేత్*


 రాహు / కేతువుల గ్రహణం అయినప్పుడు అన్ని జాతులవారికి సూతకం వస్తుంది. కాబట్టి, ఆ సమయంలో వండిన అన్నాన్ని తినకుండా గ్రహణం అయ్యాక స్నానం చేసి వండుకుని తినాలి.


*అరనాలం పయస్తక్రం దద్దిస్నేహాజ్య పాచితం మణికస్థోదకం చైవ న దుష్యేత్ రాహుసూతకే*

*అన్నం పక్వమిహత్యాజ్యం స్నానం సవనసంగ్రహే వారితక్రార నాలాది తిలదర్భైర్న దుష్యతి.* 


 *పులియబెట్టిన కడుగునీరు, పాలు, మజ్జిగ, పెరుగు, నూనె, నేతితో వండిన పదార్థాలు, గంగాజలం... వీటిపై నువ్వులను, దర్భలను వేసి ఉంచితే అవి గ్రహణసమయంలో అపవిత్రం కావు. కాబట్టి గ్రహణం తరువాత వాటిని ఉపయోగించుకోవచ్చు*.


*ముక్తౌ యస్తు న కుర్వీత స్నానం గ్రహణసూతకే*

*స సూతకీ భవేత్తావత్ యావత్స్యాత్ అపరోగ్రహః*


 *గ్రహణం విడిచాక స్నానం చెయ్యని వారికి మరల మరొక గ్రహణం వచ్చి, అప్పుడు స్నానం చేసేవరకు సూతకమే వర్తించి అప్పటి వరకు అపవిత్రులుగానే పరిగణింపబడతారు.* 


*ఇందోః లక్షగుణం పుణ్యం రవేః దశగుణం తతః*

*గంగాతోయేతు సంప్రాప్తే ఇందోః కోటీ రవేర్దశః*

*గవాం కోటి సహస్రస్య యత్ఫలం లభతే నరః*

*తత్ఫలం లభతే మర్త్యో గ్రహణే చంద్రసూర్యయోః*


 చంద్రగ్రహణ సమయంలో విధివిధానంగా స్నానం చెయ్యడం వల్ల లక్షగుణిత పుణ్యం కలుగుతుంది. సూర్యగ్రహణ సమయంలో స్నానం వల్ల దానికంటే పది రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది. *గంగానదిలో స్నానం చేస్తే చంద్రగ్రహణంలో కోటి గుణితం, సూర్యగ్రహణంలో పదికోట్ల గుణిత ఫలం లభిస్తుంది. వేలకోట్ల కొలది గోదానాల వల్ల లభించే పుణ్యం గ్రహణసమయంలో గంగాస్నానం వల్ల లభిస్తుంది.* 


*గోదావరీ మహాపుణ్యా చంద్రే రాహు సమన్వితే*

*సూర్యే చ రాహుణాగ్రస్తే తమోభూతే మహామునే*

*నర్మదా తోయ సంస్పర్శే కృతకృత్యా భవంతి తే*


 *చంద్రగ్రహణ కాలంలో గోదావరిజలం అత్యంత పుణ్యదాయకం. సూర్యగ్రహణ కాలంలో నర్మదా నదీజలం అతి పవిత్రమైన పుణ్యాన్ని కలుగజేస్తుంది.*


*స్మృత్వా శతక్రతుఫలం దృష్ట్వా సర్వాఘనాశనం*

*స్పృష్ట్వా గోమేధపుణ్యం తు పీత్వా సౌత్రామణేర్లభేత్*

*స్నాత్వావాజిమఖం పుణ్యం ప్రాప్నుయాదవిచారతః*

*రవిచంద్రోపరాగేచ అయనే చోత్తరే తథా* 


 సూర్య, చంద్ర గ్రహణ సమయాలలో, ఉత్తరాయణ సంక్రాంతి నాడు పుణ్యనదులలో స్నానం చెయ్యడం కుదరకపోతే కనీసం ఆ తీర్థాలను స్మరించాలి. ఎందుకంటే, స్మరణ వల్ల నూరు యజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుంది. తీర్థాలను చూడడం వల్ల పాపాలన్నీ నశిస్తాయి. తీర్థాల స్పర్శ వల్ల గోమేధ పుణ్యం లభిస్తుంది. తీర్థంగా త్రాగడం వల్ల సౌత్రామణి యజ్ఞఫలం పొందవచ్చు. తీర్థస్నానం వల్ల అశ్వమేధయాగ ఫలం లభిస్తుంది. 


*మంత్రాద్యారంభణం కుర్యాత్ గ్రహణే చంద్రసూర్యయోః,*

*గ్రహణాద్వా౬పి దేవేశి కాలః సప్తదినావధి.*

*సతీర్థే౬ర్కవిధుగ్రాసే తంతు దామన పర్వణి*

*మంత్రదీక్షాం ప్రకుర్వాణో మాసర్౬క్షాదీన్నశోధయేత్.*


 *గ్రహణమందు లేదా గ్రహణం నుండి ఏడు రోజుల వరకూ మంత్రోపదేశం, దీక్ష ప్రారంభానికి ఉత్తమ సమయం.  పుణ్యతీర్థములందు, సూర్యచంద్రగ్రహణమందు, పవిత్రారోపణ, దమనారోహణ పర్వాలలో మంత్రదీక్షను గ్రహించవచ్చు. ఆ సమయాలలో నెల, నక్షత్ర శుద్ధి అలాంటివేమీ పరీక్షించాల్సిన అవసరం లేదు.* 


*చంద్రసూర్యోపరాగేచ స్నాత్వా ప్రయతమానసః,* 

*స్పర్శాది మోక్షపర్యంతం జపేన్మంత్రం సమాహితః.*

*జపాద్దశాంశతో హోమః తథా హోమాత్తు తర్పణం,*

*తర్పణస్య దశాంశేన మార్జనం కథితం కిల.*

*హోమాశక్తౌ జపం కుర్యాత్ హోమసంఖ్యా చతుర్గుణం,*

*ఏవం కృతేతు మంత్రస్య జాయతే సిద్ధిరుత్తమా.*


చంద్ర, సూర్య గ్రహణములందు ప్రయత్నపూర్వకంగా స్నానం చేసి, స్పర్శ నుండి మోక్షకాలం వరకు నిశ్చల మనస్సుతో మంత్రాన్ని జపించాలి. జపంలో దశాంశం హోమం, హోమంలో దశాంశం తర్పణం, దానిలో దశాంశం మార్జనం చెయ్యాలి. హోమాలు మొదలైనవి చెయ్యలేని పక్షంలో హోమ సంఖ్యకు నాలుగింతలు జపం చెయ్యాలి. ఈ విధంగా ఆచరిస్తే మంత్రం ఉత్తమంగా సిద్ధిస్తుంది. 


*గ్రహణకాల స్నాన సంకల్పము*  

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాన్తయే ॥


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ ॥

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేం౬ఘ్రి యుగం స్మరామి ॥

  

అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతో౬పి వా |

య స్స్మరేత్పుండరీకాక్షం స బాహ్యాభ్యన్తర శ్శుచిః ॥

 

మానసం వాచికం పాపం కర్మణా సముపార్జితమ్ |

శ్రీరామ స్మరణేనైవ వ్యపోహతి న సంశయః ॥

        

     *॥ శ్రీరామ రామ రామ ॥*


తిథి ర్విష్ణు స్తథా వారో నక్షత్రం విష్ణురేవ చ ।

యోగశ్చ కరణం చైవ సర్వం విష్ణుమయం జగత్ II

  

*॥ శ్రీహరే గోవిన్ద గోవిన్ద గోవిన్ద ॥*

       

ఆచమనము చేసి, అనంతరం ప్రాణాయామము చేసి....

*మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థమ్, అద్య - శ్రీభగవతః విష్ణోః నారాయణస్య అచిన్తయా అపరిమితయా శక్త్యా బ్రియమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమతాం అనేకకోటిబ్రహ్మాణ్ణానాం ఏకతమే  పృథివీ - అప - తేజో - వాయు - ఆకాశ - అహంకార - మహద్ - అవ్యక్తైః ఆవరణైః ఆవృతే అస్మిన్  మహతి బ్రహ్మాణ్డకరణ్డ మధ్యే చతుర్దశభువనాన్తర్గతే భూమణ్డలే జంబూ ప్లక్ష శాక శాల్మలి కుశ క్రౌఞ్చ పుష్కరాఖ్య సప్తద్వీపమధ్యే... జంబూ ద్వీపే భారత కింపురుష హరి ఇలావృత రమ్యక హిరణ్మయ కురు భద్రాశ్వ కేతుమాల నవవర్షమధ్యే భారతవర్షే... ఇన్ద్ర చేరు తామ్ర గభస్తి నాగ సౌమ్య గన్ధర్వ చారణ భరత నవఖండ మధ్యే..* 


*భరతఖణ్డే సుమేరు నిషద హేమకూట హిమాచల మాల్యవత్ పారియాత్రక గన్ధమాదన కైలాస వింధ్యాచలాది అనేకపుణ్యశైలానాం మధ్యే...*


*దండకారణ్య చంపకారణ్య వింధ్యారణ్య వీక్షారణ్య శ్వేతారణ్య వేదారణ్యాది అనేక పుణ్యారణ్యానాం మధ్యే... కర్మభూమౌ...*


*రామసేతు కేదారయోః మధ్యే... భాగీరథీ యమునా నర్మదా త్రివేణీ మలాపహారిణీ గౌతమీ కృష్ణవేణీ తుంగభద్రా కావేర్యాది అనేక పుణ్యనదీ విరాజితే...*


*ఇన్ద్రప్రస్థ యమప్రస్థ అవన్తికాపురీ హస్తినాపురీ అయోధ్యాపురీ ద్వారకా మధురాపురీ మాయాపురీ కాశీపురీ కాఞ్చ పుర్యాది అనేక పుణ్యపురీ విరాజితే...* 

   

*సకలజగత్స్రష్టుః పరార్ధద్వయ జీవినః బ్రహ్మణః ద్వితీయపరార్థే పఞ్చశద్ అబ్దాదౌ ప్రథమే వర్షే ప్రథమే మాసే ప్రథమే పక్షే ప్రథమే దివసే అహ్ని ద్వితీయే... యామే తృతీయే ముహూర్తే... స్వాయమ్భువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుషాఖ్యేషు షట్సుమనుషు అతీతేషు సప్తమే వైవస్వతమన్వన్తరే, అష్టావింశతితమే కలియుగే ప్రథమే పాదే అస్మిన్ వర్తమానే వ్యావహారికాణాం ప్రభవాదీనాం షష్ట్యాః సంవత్సరాణాం మధ్యే....*


*స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్షఋతౌ,

భాద్రపదమాసే,  శుక్ల పక్షే, పూర్ణిమాయాం శుభతిధౌ, భానువాసరే,  పూర్వాభాద్ర నక్షత్రే, ధృతి యోగే, బవ, భాలవ కరణే  ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం పూర్ణిమాయాం శుభతిధౌ*


*అనాది - అవిద్యా వాసనయా ప్రవర్తమానే అస్మిన్ మహతి సంసారచక్రే విచిత్రాభిః కర్మగతిభిః విచిత్రాసు యోనిషు పునఃపునః అనేకధా జనిత్వా కేనాపి పుణ్యకర్మవిశేషేణ ఇదానీంతన మానుష జన్మ  విశేషం ప్రాప్తవతః, మమ జన్మాభ్యాసాత్ జన్మప్రభృతి ఏతక్షణపర్యన్తం బాల్యే కౌమారే యౌవనే మధ్యమే వయసి వార్ధకే చ జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థాసు, మనో వాక్కాయాఖ్య త్రికరణచేష్టయా కర్మేన్ద్రియ జ్ఞానేంద్రియ వ్యాపారైః సంభవితానాం... ఇహ జన్మని జన్మాన్తరే చ జ్ఞానాజ్ఞానకృతానాం మహాపాతకానాం, మహాపాతకానుమన్తృత్వాదీనాం, సమపాతకానాం ఉపపాతకానాం, మలినీకరణానాం... గర్ఘ్యధన, ఆదాన, ఉపజీవనాదీనాం అపాత్రీకరణానాం జాతిభ్రంశ కరాణాం, విహిత కర్మత్యాగ నిన్దిత సమాచరణాదీనాం, జ్ఞానతః సకృత్ కృతానాం, అజ్ఞానతః అసకృత్ కృతానాం పాపానాం సద్యః అపనోదనార్థం...*


మహాగణపత్యాది సమస్త వైదిక దేవతా సన్నిధౌ... *చంద్రగ్రహణ పుణ్యకాల స్నానమహం కరిష్యే |* 


    'అప ఉపస్పృశ్య' 


గంగా గంగేతి యో బ్రూయాద్యోజనానాం శతైరపి|

ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం స గచ్ఛతి ||


గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి | 

నర్మదే సిన్ధు కావేర్యౌ‌ జలేస్మిన్ సన్నిధిం కురు ||

   

అతిక్రూర మహాకాయ కల్పాన్తదహనోపమ |

భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతు మర్హసి ||


*(ప్రోక్షణమంత్రాః / స్నానమంత్రాః)*

    

భగవన్ నామం స్మరణ చేస్తూ స్నానం చేసి, తదుపరి మడి వస్త్రాలు ధరించి, తమ ఆచారాన్ని అనుసరించి, కుంకుమ, విభూది , త్రిపుండరములు ఇత్యాది ధారణ చేసి  అనంతరం ఆచమనం  జపం అనుసరించాలి. 


*ఓం నమో భగవతే వాసుదేవాయ.. ఓం నమశ్శివాయ..* 🙏

*హరహర మహాదేవ గోవిందా గోవింద* 🙏

🌹🙏🏻🌹

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow