77. కైలాసగిరి వాసా...రా రా ఓ గౌరీశా...| Kailasa Girivasa raara ooo gouriesha - శివ భజన పాటల లిరిక్స్
September 02, 2025
కైలాసగిరి వాసా...రా రా ఓ గౌరీశా...
పిలిచిన పలుకవు భక్తుల కానవు
ఎంతని నిను వేడను ఏమని కొనియాడను
గరళము మింగి నీవు నీలకంఠుడైనావు
శిరమున గంగ దాల్చి జటాధారివైనావు
అడిగిన వరాలిచ్చే బోళా శంకరా
సర్పరాజులందరూ నీ తోడుగా దిగిరావా
అర్ధనారీశ్వరుడై ఆనతిచ్చి మము బ్రోవ
లోకాల శంకరుడా మా స్తుతులను గైకొనరా
నంది వాహనమెక్కి బంధనాలు తొలగించ
విభూతి రేఖలతో మాకై నువు దిగి రావా
కోటిలింగాలలోన లింగేశ్వరుడైనావు
డమరుక నాదముతో రుద్ర నేత్రుడయినావు
సప్త మహర్షులంతా భక్తితో నిను కొలువంగా
పార్వతీ సమేతుడవై పరమేశా దిగిరావా
Tags
