అన్నా ఏడవకురా లవ్వన్నా ఏడవకురా.
ఏడిస్తే నీ కనుల నీలాలు రాలునురా.
జో జో లాలీ ఆ లాలీ జో లాలి. జో..........
లాలి జో జో లాలి ఆ లాలీ జోలలి.
(1) ఒక రాత్రి ఒక పగలు పొన్నామా నీచెట్టు కిందా
ఒంటోంటి బ్రతుకేయే ఓ చందా మామయ్య.
(పల్లవి)
(2) పినతండ్రి లక్ష్మణుడు ప్రతి దినమూ నినుదలచు
మీ తండ్రి రాములకు మీరు ఉండేది తెలియదురా. (పల్లవి)
(3) నెత్తిన కిరీటం నెలవంక నా మమురా
పున్నమి నాటి చంద్రుడా నా తండ్రి ఏడకురా. (పల్లవి)
