చెన్నై అణ్ణానగర్ అయ్యప్ప ఆలయం*
చెన్నైలోని రద్దినిండిన ప్రదేశమగు అణ్ణానగర్ నడిబొడ్డున ఈ ఆలయము నెలకొని యున్నది. 1973 మొదలు అణ్ణానగర్ మరియు శాంతికాలని పరిసర ప్రాంతములోని అయ్యప్ప భక్తులందరూ యొక బృందమై అయ్యప్ప సేవాసమాజం అను సమూహ్య ఆధ్యాత్మిక సంఘమును ఏర్పరచుకొని ఈ ప్రాంతమున స్వామి అయ్యప్ప పూజలు భజనలు యాత్రా పరిపాటితోపాటి సామూహిక సేవలుకూడా చేయుచుండేవారు. దీనికి అనుభందముగానే ఇప్పటి అణ్ణానగర్ అయ్యప్ప దేవాలయమును 1984న అత్యద్భుత కళాత్మకమైన ఆలయముగా నిర్మించిరి. ఈ దేవాలయ ప్రతిష్ఠలు క్షేత్ర తంత్రి అంబి కృష్ణధార్ నంబూద్రిగారి కరకమలములచే జరిగినది. మండల మకరమహోత్సవ వేళలో వేలసంఖ్యలో ఇచ్చటి దేవాలయములో భక్తులు మాలవేసుకొందురు. రోజుకు సుమారు 500 వందల మందికి పైగా ఇరుముడి కట్టుకొని శబరిమల యాత్ర వెళ్ళివచ్చుచుంటారు. ఇచ్చటనుండి శబరిమలకు వెళ్ళే భక్తుల సౌకర్యార్థం శబరిమలపై యొక కాటేజికూడా కట్టించియున్నారు. ఈ ఆలయమునకు అనుభందముగా ఆధ్యాత్మిక కార్యక్రమములు నిర్వహించుటకు ఆదిశంకర ఆడిటోరియం అను పేరయొక డార్మిట్రీ , ఒక హాలుకూడా కలదు. ఇదికాక గత 37 సం॥లుగా పలువేల రోగులకు ఉచ్చిత వైద్యసేవలందిచే మెడికల్ సెంటర్ ఆలయము తరపున నిర్వహించుచున్నారు. ఇవికాకుండా ఆవడి సమీపమున అరిక్కంపేట్ అను స్థలమున ఒక ఇంగ్లీష్ మీడియమ్ స్కూల్ కూడా దేవాలయము తరపున నిర్వహించుచున్నారు. తదుపరి అయ్యప్ప సేవాసమాజం తరపున ఒక అనాధ శరణాలయము , వృద్ధాశ్రమము ప్రారంభించుటకు సంకల్పించియున్నారు. త్రికాల పూజలు తాంత్ర విధానముగా నిర్వహించు చెన్నై అణ్ణానగర్ అయ్యప్ప దేవాలయమును భక్తులు ఓమారు దర్శించి తరించవలయునని వేడుకొనుచున్నాము.
*రేపు కాశి (వారణాసి) అయ్యప్ప ఆలయం గురించి తెలుసుకుందాము*
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*
