శ్రీ మహాశాస్తా చరితము - 101 | శనివారవ్రత మహిమ | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 101 | శనివారవ్రత మహిమ | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

శనివారవ్రత మహిమ*

ఒకప్పుడు విదర్భ దేశమును *'మహీధరుడు'* అను రాజు పరిపాలించుచుండెను. అతడు స్వామి
యొక్క పరమభక్తుడు విధివశాత్తు *'రౌద్రశ్వుడు'* అను రాజుచే ఓడింపబడి , రాజ్యమును కోల్పోయి. అడవులందు అజ్ఞాతవాసము చేయు పరిస్థితి ఏర్పడినది.

కాననము నందున్ననూ , స్వామిని పూజించుట మానలేదు. అతడికి సహాయము చేయగోరి ,
అగస్త్య మహాముని అతడివద్దకు పోయి , స్వామి భక్తుడైన రాజునకు , శనివారవ్రతమును
ఆచరింపుమనియూ , వ్రతవిధానమునూ నుడివెను.

ముని యొక్క మాట ప్రకారము మహీధరుడు ఆరు నెలలపాటు భక్తి శ్రద్ధలతో వ్రతమును
ఆచరించగా , మెచ్చిన స్వామి అతడిముందు సాక్షాత్కరించెను. తన గణములచే మహారాజునకు సాయముగా పంపి , యుద్ధమున మహీధరుడు తన శత్రువులను అవలీలగా చంపునట్లు చేసెను. స్వామి అనుగ్రహమును సదా పొందుచూ , మనోరంజకముగా పరిపాలించసాగెను.

శాస్తా కొరకై చేయు వ్రతములన్నిటిలోనూ , మిక్కిలి శ్రేష్ఠమైన ఈ వ్రతమును గూర్చి చెప్పనలవికాదు. ఈ వ్రత ఫలితముగానే ఇంద్రుడు జయంతుని పుత్రునిగా పొందెను. వ్యాసుడు శుకమహర్షిని తనయునిగా పొందెను. అత్రిమహర్షి రుద్రాంశ సంభూతుడైన దుర్వాసుని కుమారునిగా పొందెను.

*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow