అందులకు ఆ అమ్మగారు *"కేశవా ! నీవు శబరిమల కోవెలకు వెడలి అయ్యప్పస్వామి వారిని దర్శించియున్నావా"* యని అడిగెను.
కొన్ని సంవత్సరములకు ముందుగూడ తాను కడుపునొప్పితో బాధపడుచుండినది గాంచిన కొందరు నీవు శబరిమలకు వెడలివచ్చినచో ఉదరవేదన నయమగుటకు అవకాశము గలదని తెలుపగా , ఆమేరకు క్రమముగా మాలధరించి , విధిగా దీక్షబూని , ఇరుముడి దాల్చి శబరిమలకు వెడలివచ్చెను. కాని ఫలితము శూన్యము. కడుపునొప్పి కొంచెము కూడా తగ్గక పోవడముతో తదుపరి సంవత్సరము వెళ్ళలేదు. కావున నారాయణి అమ్మగారి ప్రశ్నకు మిక్కిలి జంకుతో...
...*"ఒకే యొక పర్యాయము వెడలి వచ్చితిని తల్లి"* యని సమాధానమిచ్చెను. *“శరణాలు పలికే అలవాటు యున్నదా ?" మాలధరించినపుడు మాత్రము యుండినది”. “ఇంకేమి భయము ! నీ వ్యాధికి తగు ఔషధము నీ వద్దనే యున్నది. చింతను వీడుము.''మీరేమంటున్నారో నాకర్థం కావడం లేదమ్మా"! కేశవా ! శ్రద్ధగా వినుము. “శరణములంటే మరణములేదు - అయ్యప్ప నామం తారకమంత్రం!"* శబరిమల యాత్రకు స్వామి శరణనామములే మార్గదర్శి , మార్గానుచారి , మార్గబంధువు అని అంటారు. కనుకనే స్వామి భక్తులు సదా శ్రీస్వామి శరణములను పలుకుతూ , వ్రాస్తూ తమ 41 దినముల దీక్షను పూర్తిజేసి ఇరుముడికట్టి , శబరిగిరి యాత్ర గావించవలయునన్నదే మన ఆర్యులు ఏర్పరచి యున్న విధి.
ఈ శరణ నామము శ్రీస్వామి అయ్యప్పకు మిక్కిలి ఇష్టమైన మంత్రమగును. దీని వెనుక సూక్ష్మమైన ఒక పరమార్థ తత్వము దాగియున్నది. ప్రాచీన తాళపత్ర గ్రంథముల మూలాన ఇది లభించడమైనది. *కర్మవ్యాధిని కూడా తీర్చగల శ్రీ స్వామి శరణ నామములోని పరమార్థతత్వాన్ని తెలుసుకొని స్వామి శరణాలు పలుకుతూ శబరిమలయాత్ర గావించినచో ఫలితము మరింత హెచ్చుగా యుండును. అంతటి మహిమాన్వితమైన శ్రీస్వామి శరణ మంత్రమును మీకిప్పుడు చెపుతాను. శ్రద్ధగా వినుము.*
*స్వామి శరణ మంత్రము*
ఋషి ప్రోక్తంతు పూర్వాణం మహత్మానాం గురోర్మతం |
"స్వామి శరణ" మిత్యేవం ముద్రావాక్యం ప్రకీర్తితం ॥
"స్వా" కారోచ్చార మాత్రేణ "స్వా" కారం దీప్యతే ముదే |
"మ" కారంతు శివంప్రోక్తం "ఇ" కారం శక్తి రుహ్యతే ||
స్వాత్మానాంచ పరాత్మానాం తయోరైక్యాత్తదం శుభం |
ప్రసన్నం భార సంహరం వినీతం వశ్య కారణం ॥
"శం" బీజం శత్రు సంహరం రేఫం జ్ఞానాగ్ని వర్ధనం |
"ణ కారం" సిద్ధితం శాంతం ముద్రా వినయ సాధనం ||
శాస్త్రుముద్రా వాక్యమేవం యన్ముదే పరిశోభితే |

తన్ముఖే వసతే లక్ష్మీ విద్యా విదయ శాలినే ॥
కలౌ ఛష చిత్తానాం నరాణాం పరిశుద్ధయే |
కలౌ ఛష చిత్తానాం నరాణాం పరిశుద్ధయే |
ఋషీణాం పునరాధ్యానాం ఉపదేశం మహత్తమం ||
*తాత్పర్యము:-*
ప్రాణ , అపాన , వ్యాన , ఉదాన , సమాన వాయువులను కట్టు బరచుటకు ఉపయోగకరమైనదియూ , సర్వులు సులభముగా ఉచ్చరించి ముక్తిపొంద దగినదియు , అలనాటి ఋషులచే ఉపదేశించబడినదియూ , తదుపరి వచ్చిన మహాత్ములంగీకరించి నదియు ఐన *'స్వామిశరణం'* అను దివ్యమంత్రము శ్రీస్వామి అయ్యప్పకు చాలా ఆనందాన్ని కలిగించేటిదగును. *'స్వా'* అన్న అక్షరం ఉచ్చరించినంత మాత్రమున హృదయాంతర్గతమైన *'ఆత్మ'* జాజ్వల్యమానముగా కాంతి ప్రభలను విరజిమ్మును. అనగా అజ్ఞానమనే చీకటి నశించిపోవును. ఈ ఆత్మయే సర్వహృదయాంతర్గతమైన మంగళ స్వరూపమగు శివ స్వరూపము. మాయను అభిష్టానము గావించుకొనిన పరమేశ్వరుడు , ఈ పంచ భూతాత్మకమైన సృష్టిని గావించి ప్రకృతిమాత మాయా వాగురము లలో జీవులను పడతోసి భ్రష్ట బద్దులు గావించుచున్నాడు. అట్టి త్రిగుణములను అధీనపరచి , ప్రకృతికాంతను శివస్వరూపముతో ఐక్యము గావించి అజ్ఞాన నిర్మూలము గావించుకోవడమే *"స్వామి"* అన్నపద ఉచ్చారణకు సూక్ష్మార్ధము. దీనివలన జీవులకు శుభం కలుగుతుంది. అందుకే మాల ధరించిన స్వాములు కలుసు కున్నప్పుడు , స్వామి , అని పిలవమన్నారు కాబోలు.
*'శ'* కారము అనగా శత్రు సంహారము. మనలోని కామ , క్రోధాదులనెడి శత్రువులను సంహరించడమే 'శ' వాచకమునకు అర్థము. 'ర'కారము జ్ఞానాగ్ని వాచకము. కామక్రోధాదులు నశించిన జీవులకు జ్ఞానము సిద్ధించును. 'ణ' కారము సిద్ధితం శాంతం. 'ణ' కారము శాంతిని సిద్ధింపజేయును. అనగా కామ క్రోధాదులను సంహరింపచేసుకొన్న జ్ఞానికి 'శాంతి' లభిస్తుంది. ఇదియే 'శరణం' అను పదమునకు పరమార్థము. 'ముద్ర' అనగా భక్తుల యొక్క భవ బాధలను పోగొట్టునది. శ్రీస్వామి వారికి సంతోషము కలిగించునది అని అర్ధము. దీనిని వినయముతోనే సాధించవలెను.
*'శాస్త్రృ ముద్రా'* అనబడు 'స్వామి శరణం' అను ఈ వాక్యము ఎవరి ముఖమునుండి వెలువడుతుందో వారి ముఖమున లక్ష్మీకళ ప్రశోభిల్లును. వారియొక్క వాక్కులో సరస్వతి నివసించును. వారు శ్రీమంతులు , దయాళులు , విద్యావంతులు , వినయవంతులు కాగలరు.
కనుక ఈ కలిలో నీటిలోని చేపలా నిలకడ లేక సదా చంచలచిత్తులై వ్యవహరించు మానవులకు చిత్తశుద్ధి కలిగించుటకు అలనాటి ఋషులు మహత్వము నిండిన ఈ మహామంత్రము నుపదేశించి యున్నారు. *'స్వామియే శరణం అయ్యప్ప'* అను మంత్రమును నాభికమలము నుండి బయలుదేరు ప్రాణవాయువును హృదయ మార్గముగా పయనింపజేసి నాలుకపై శబ్దముగా తాండవింపజేయ వలయును.
*కలౌ కల్మష చిత్తనం పాప ద్రవ్యోప జీవినాం |

విధి క్రియా విహీనానాం గతిర్గోవింద కీర్తనం ॥*
ఈ కలికాలములో కల్మష చిత్తులైనవారూ , పాప కృత సంపాదనతో జీవించువారూ , విధితమైన వృత్తులను మాని ప్రవర్తించువారూ సద్గతి పొందుటకు భగవన్నామ సంకీర్తన యొక్కటియే చక్కని మార్గమని అంటుంది పై శ్లోకము. అదియు గాక కృత , త్రేతా , ద్వాపర యుగాలలో తపము , యజ్ఞము , దానధర్మాదుల వలన పొందే సత్ఫలితాన్ని కలిలో నామజప సంకీర్తన వలన సులభముగా పొందవచ్చునంటారు పెద్దలు. ఈ ఆర్యోక్తిని ఆధారముగా గొని సర్వత్రా శ్రీస్వామివారి శరణునామ జపమును మారుమ్రోగింప జేయవలయు ననియు , తన్మూలన లోక క్షేమం వర్ధిల్లాలనియు సత్సంకల్పంతో శరణు కోటి మహాయజ్ఞములో వర్ణ , వర్గ , వయో , లింగభేదము లేక సర్వులు భాగస్వాములై , *"ఓం స్వామియే శరణం అయ్యప్ప"* అంటూ వ్రాయడం మొదలు పెట్టండి. ఒక్కసారి వ్రాస్తే పదిసార్లు చెప్పుకొన్నట్లని గ్రహించి పట్టుగా శరణుకోటి వ్రాయండి. అలా వ్రాసిన శరణుకోటి కాగితాలను తమ గ్రామములోనో లేక సమీపమునందుగల అయ్యప్ప స్వామి దేవస్థానం వారికందించండి. ఒక కోటి నామములయ్యాక ఆ దేవాలయ ప్రాంగణంలో శరణు కోటి స్థూపం నిర్మించి , అందులో సేకరించబడిన శరణుకోటి కాగితాలతో నింపి మూసి వేయండి.
కొన్నాళ్ళకందుండి యొక దివ్యశక్తి వెలువడి అచ్చట ప్రతిష్టితమైవున్న గ్రామ రక్షక దైవమైన అయ్యప్ప విగ్రహానికి చైతన్యాభివృద్ధి కలిగి , గ్రామములో దుష్ట శక్తుల ప్రవేశం నిషేధించబడి, భక్తులకు ఆరోగ్యం , మనశ్శాంతి మున్నగునవి లభించును. దేశవ్యాప్తంగా ఉండే అయ్యప్ప దేవాలయాల నిర్వాహకులు ఇందులోని పరమార్థ తత్వాన్ని గుర్తించి , భక్తులను ప్రోత్సాహపరచి , ప్రతివారిని అనుదినం వంద శరణాలకు తగ్గక వ్రాయించి , అలా వ్రాయబడ్డ కాగితాలను తమ దేవాలయానికి లభించిన విలువైన విరాళంగా తలచి , సేకరించి , పొదుపుచేసి ఉంచితే... కొన్నాళ్ళకు భారత దేశములోని అన్ని అయ్యప్ప దేవాలయాలలోను శరణుకోటి స్థూపాలు నిర్మితమౌతుంది. ముఖ్యంగా శబరిమలకు వెళ్ళలేని స్త్రీలు , వృద్ధులు , పిల్లలు , అనారోగ్య వంతులు , దీన్ని యొక యజ్ఞంలా దలచి దినమొక శరణకోటి కాగితం వ్రాయడం మొదలిడితే ఆ శరణఘోష ప్రియుని కృప వలన సర్వులకు సర్వకార్యానుకూలం సిద్ధించును.
ఇలాంటి కర్మవ్యాధులు ఆ గ్రామస్తులకు అంటవు. శరణుకోటి మహా యజ్ఞ పుణ్యఫలంగా అలా ఇదివరకే అట్టి కర్మవ్యాధులు యుండినను అవన్నియు మాసిపోవును. *'కర్పూరమంటే తనకెంతో పానకమంటే మరియెంతో శరణన్న పదము ఎంతెంతో ఇష్టం స్వామికి అన్నమాట* ప్రతివారికి తెలుసు. కావున శ్రీ స్వామివారికి చాలా ఇష్టమైన శరణుకోటిని లెక్కపెట్టలేనన్ని వ్రాసి శ్రీ స్వామి వారి నుండి ఎనలేని అనుగ్రహ సంపదను పొందుటకు కృషిచేయవలెను. *“కేశవా ! మరలా నీకు చెపుతున్నా. శ్రద్ధగా వినుము. “శరణములంటే మరణములేదు - అయ్యప్ప నామమే తారకమంత్రం !"* *"రామునికన్న శ్రీరామ నామముమిన్న శ్రీస్వామివారికన్న- స్వామి శరణ తారక మంత్రమునకు మహిమలు మిన్న".* నీవు ఆ తారకనామ జప సంకీర్తనముయొక్క మహాత్మ్యమును పరిపూర్ణముగా గ్రహించక యాత్రగావించి నందువలన తగు ఫలితము లభించకపోయి యుండవచ్చునని తలంచుచున్నాను.
మరణమునే జయించగల (ముక్తిని ప్రసాదించగల) ఈ స్వామి శరణ నామ జప సంకీర్తన పారాయణముచే తొలగని కర్మవ్యాధులు గూడా గలవా ? కనుక కేశవా ! నీ దీర్ఘకాల కర్మవ్యాధియగు ఉదరవేదనను తీర్చగల మహౌ షధముగా *"స్వామి శరణం"* అను తారకమంత్రమును యొసంగు చున్నాను. ఈ పర్యాయము నీవు దృఢవిశ్వాసముతో శబరిమల యాత్రజేసి , అయ్యప్ప సన్నిధానము ముంగిట నిలిచి నీ నోటినుండి ఎన్ని పదములు పలుకులుగా వెలువడు చున్నదియో అవి యన్నిటిని *"స్వామి శరణం"* అను పదములుగా పలుకు చుండుము మంచిదే జరుగును. వెళ్ళిరమ్ము శుభము కలుగును" అని నారాయణియమ్మ కేశవుని ఆశీర్వదించి పంపేను.