*స్వామి కొలువైయుండు ముఖ్యమైన కొన్ని ఆలయాలు - 4*
*చెండాడుం అయ్యనార్*(చెండాడు అయ్యనారు)
*'మయిలాడుదురై'* నుండి *'సెంపొన్నార్'* ఆలయము మీదుగా , *'పూంబుకార్'* రహదారియందు
అమరియున్నది. దేవేంద్రుడు శూరపద్మునకు భయపడి , ఇంద్రాణిని అయ్యనారుకి అప్పగించిన
స్థలము.
భువనేశ్వరీదేవి దక్షిణ దిశను చూస్తున్నదై యుండగా , అమ్మవారికి ఎడమవైపుగా , పడమర
దిశను చూస్తూ పూర్ణా , పుష్కలాసమేతునిగా కొలువైయున్నాడు.
*సురైక్కాయూర్ శాస్తా*
(సొరకాయ , ఊరియందు గల శాస్తా)
తంజావూరు జిల్లాకు చెందిన *'మేలట్టూరు'నకు* సమీపమున అమరియున్న స్థలము. అద్భుతమైన
రూపలావణ్యములు కలిగి , తన భార్యతో గంభీరముగా దర్శనమిచ్చుస్థలము.
అందమైన సొరకాయగా ఊరియందు కొలువై , అలంకార శాస్తావై , అభిషేక ప్రియుడివై , మా
కులదైవమై , నీవు కొనయాడబడుదువుగాక. *(కులదైవ ప్రార్థన)*
ప్రతి సంవత్సరమూ ఈ స్థలమునకు సమీపముగా మేలట్టూరు నందు జరుగు *'భాగవతమేళా'*
యందు హరిహర పుత్ర జననము చారిత్రక ఘట్టములుగా ప్రదర్శింపబడును.
*కల్యాణశాస్తా*
పూర్ణా పుష్కలాసమేతుడై వివాహప్రాప్తికై , కోరిన వరములను ప్రసాదించునట్లుగా కల్యాణశాస్తాగా
అవతరించుయున్నస్థలము.
*'తిరువాయాట్రు'* అను స్థలమున , గణపతి అగ్రహారము అను ప్రదేశమున కొలువైయున్నాడు.
*తడియాడయ అయ్యనారు*
*'కొత్త మంగలం'నకు* సమీపమున సాత్తన్ కోవెల *'కణ్ణన్ కారకుడి'* అను స్థలమున కొలువైయున్నాడు.
ఫాలై వృక్షము నుండి , విభూతి రుద్రాక్షలతో పాటు చేతి కర్రను బూనిన స్వయంభువునిగా
అవతరించినవాడు. *'తిరుప్పేరియూర్'* నాటలింగ ధర్మశాస్తాగా , మూలవిరాట్టు పిలువబడుచుండును.
*కూరంబశాస్తా*
*'తిరువారూరు'* జిల్లా , మన్నార్ కుడి తాలూకాయందు నెమ్మేలి అనుచోట పూర్ణా పుష్కలా
సమేతునిగా విల్లసిల్లుచున్నాడు.
ముచుకుంద మహారాజు కాలమున స్వయంభువునిగా ఆవిర్భవించినవాడు. పూర్ణా , పుష్కలా
సమేతునిగా మూడు శిలారూపములుగా కనిపించును. అశ్వవాహనుడై ఊరేగువాడు.
*మంజనీర్ కూత్త శాస్తా (అయ్యనారు)*
తంజావూర్ జిల్లా *'కుడందై'క్కు సమీపమున 'మల్లపురం'* అను ఊరియందు కొలువైయున్నాడు.
ఈ మంజళ్ నీర్ కూత్త అయ్యనారు పూర్ణాపుష్కలా సమేతునిగా , పలువురు పరివారగణములతో
పరివేష్టించబడుచూ , పొలముగట్లపై వెలసియున్నాడు. ఈ ఆలయము అతి పురాతనమైనది.
స్వామి యొక్క భక్తురాలు ఒకరు , అడవియందు దొంగలచేత చిక్కినదైయుండగా , అశ్వారూఢునిగా
వచ్చిన శాస్తా , దొంగలను తరిమికొట్టి భక్తురాలిన కాపాడిన స్థలము.
*ఒట్టి ఇడం కొండ అయ్యనారు*
*'మయిలాడుదురై'* కడలంగుడికి సమీపమున ఆలయము కలిగియున్నవాడు. దేవేరు లిద్దరితోనూ
దర్శరమిచ్చును. విగ్రహరూపమున ఇతడు *'పాలక్కాడు'* నుండి ఇచటికి వచ్చినవాడు. భక్తులకు
అనుకూలముగా వరములకు ప్రసాదించువాడు.
*కర్కువేల్ అయ్యనారు*
తమిళనాడుకి దక్షిణమున నున్న *'ఉడన కుడి'* కి సమీపమున నున్న *'తేరికుడి ఇరుప్పు'* అను స్థలమున కర్కువేల్ అయ్యనారు కొలువైయున్నాడు. ఇది మిక్కిలి ప్రసిద్ధి చెందిన ప్రదేశము.
ఇందుపూర్ణా పుష్కలాసమేతునిగా దర్శనమిచ్చును. ఈ ఆలయమునందు జరుపబడు *'కళ్ళర్ పెట్టు తిరువిళా'* అను ఉత్సవము ప్రసిద్ధి చెందినది.
*ఇలందురై అయ్యనారు*
అంగారక క్షేత్రముగా విలసిల్లు *'ఇలందురై'* నందు *'సేవుక పెరుమాన్ అయ్యనారు'*
కొలువైయున్నాడు. తంజావూరు జిల్లా *'తిరునీలక్కుడి'కి* సమీపమున వెలసియున్నదీ ఆలయము.
*వెళ్ళతాంగి అయ్యనారు*
పాండిచ్చేరి యందు కొలువైయున్నవాడు వెళ్ళన్ తాంగి అయ్యనారు. భోరుమని వర్షము కురియుచుండగా , ఊరే వెల్లువగా ప్రవహించిననూ , పాండిచ్చేరి ప్రజలను వెల్లువనుండి కాపాడినవాడు. పూర్ణా పుష్కలా సమేతునిగా , తన పరివార గణములతో కొలువయున్నాడు.
*చొక్కనాధ అయ్యనారు*
*'వేదారణ్యమున'* నకు సమీపమున *'సెంప్బొడై'* అను స్థలమున చొక్కనాధ అయ్యనారుగా
పూర్ణాపుష్కలా సమేతునిగా అనేక పరివార గణములతో పరివేష్టింపబడి యుండును.
*సేవుక పెరుమాన్ అయ్యనారు*
*'సింగపుణరి'* యందు , పూర్ణా పుష్కలా సమేతునిగా సేవుక పెరుమాన్ అయ్యనారుగా
శాస్తా మిక్కిలి ప్రసిద్ధి చెందినవాడు.
ఈనాటికీ పలువురు భక్తులకు స్వప్నమునందును , నిజమునందునూ సాక్షాత్కారమును
ఇచ్చుచుండును.
*ఆగాయ అయ్యనారు (ఆకాశఅయ్యనారు)*
*'మయిలాడుదురై'* కి సమీపమున కుట్రాలం రాజగోపాలపురము నందు తపోభంగిమలో మనకు
దర్శనమిచ్చును. ప్రకృతి శోభను కలిగియున్న ఈ ప్రదేశమునందు పరివార గణములతో పరివేష్టింపబడి
యుండును.
ఈ ఆలయపు కప్పు , ఇరుమార్లు ధ్వంసమై కిందపడిపోయినది. భక్తులు మరల మరల దానిని
యధాశక్తిరూపముగా నిర్మించుటను చూచిన శాస్తా ఆవేశముగా , ఆలయపు పైభాగమును
పునరుద్ధరించవలదనియూ , అట్లే ఆకాశమును చూచు విధముగా నుండుటయే తనకు సమ్మతమనెను.
అంతట అట్లే వదలివేయబడెను.
*పన్నెండుగురు అయ్యనార్లు*
పశుంపొన్ తాలూకాకు చెందిన *'పుదువయల్'* నకు సమీపమున ఉండు *పెరియకోట్టై*
గ్రామమునందు , ఒకే ఆలయమునందు పన్నెండుగురు అయ్యనార్లు కొలువైయుందురు. పన్నెండుగురు
అయ్యనార్లకూ విడివిడిగా ప్రత్యేక పరివారమూర్తులు ఉండుట విశేషము.
