*భూతసైన్యము*
శాస్తా యొక్క భూతగణములందు పెక్కువాటిని మనము చూడగలము. పెరుంభూతం , కరుంభూతం ,నట్టభూతం ,
ఒట్టభుతం , ఇడమలైభూతం , కాంచరభూతం , గుండాందడి భూతం , ఆనంతభూతము ,
వెళ్ళెకల భూతము , పాతాళభూతము ఇట్లు అనేక రకములుగా కానవచ్చును.
*ఇతర సైన్యములు*
వల్లవన్ , కాలత్తం బిరాన్ అడియొడి కావలన్ , దడియన్ , కాంచలన్ , సుడలైమాడన్ , చాముండి ,
బేతాళం , శరవన్ , కుడకురుట్టి , పళియన్ , భూతరాయన , పగడన్ , దడియాన్ , వన్నిరాయన్ ,
పట్టరాయన , కురళి , పాతాళి , రణవీరన్ , సెంజడెయన్ , మాకాళి , పగడెయన , సింగనాడన్ ,
సింగన్ , ముండన్ , కట్టారి , తుంగంచిరట్టి , ఇరుళప్పన్ , దానువన్ , కరియన , కాడిక్కవడియన్ ,
కూళి , సెందుళ్ళి , దురై , వంధ్యన్ , వడివన్ వంటి వారు ఇతర సైన్యములుగా పేర్కొనదగినవారు.
రక్తవరి కణ్ణన్ , ఇసక్కి సంగిలితోళన , పగడచిన్నన , సాక్షైక్రైమురుగన్ , పట్టాణివీరన్ , సుడలైముత్తు ,
నొండివీరప్పన్ , కాత్తవరాయన్ వంటి వారిని కూడా చూడవచ్చును.
స్వామి ఊరేగింపుగా వచ్చు సమయమునందు కోట్లాది భూత సేనలు గుమిగూడి స్వామికి సేవలు
చేయుచుందురు.
స్వామి యొక్క ఊరేగింపు సమయమున నట్టభూతం దీపపు సెమ్మెలు మోయచుండును.
వంజియైభూతం ఎదుర్కోలు వేడుకలు గావించును. వెళ్ళెక్కల్ భూతము స్వామి యొక్క బిరుదములను
గానము చేయును.
రణవేరియన్ , కరుప్పన్ వంటివారు , కుడకురుట్టి , సరగురుట్టి వంటివారు బిగ్గరగా రంకెలు
వేయుచుందురు. సావలన్ తాళము వేయుచుండును. రణవీరన్ స్వామి యొక్క ఖడ్గమును మోసుకొని వచ్చుచుండును. వెళ్ళెక్కల భూతము వింజామర వీయుచుండును. బేతాళం ఛత్రమును చేతబూని వచ్చుచుండును.
ముల్లెకుమారి , సుందరయక్షివంటివారు చామరము వీయుచుందురు.
భూతనాధుడైన శాస్తాకి సహాయముగా పంపుటకై ఈశ్వరుడు ప్రమధగణములను సృష్టింపనెంచెను.
ఎరుపురంగు మేని ఛాయను గలవాడు ఒకరైనచో , నల్లని ఛాయను కలిగినవాడు మరొకరుగా
సృస్టించెను.
అందము , గంభీరము , బంగారము ఛాయను కలిగినవాడు. మహావీర నామధేయమును ,
ధృడగాత్రుడై , ఉగ్రస్వరూపమును కలిగి , నల్లని ఛామను కలిగినవాడు మహాకాలనామ ధేయములు
పొందిరి.
ఈశ్వరుడు వారిని భువనైక పాలకుడైన శ్రీమహాశాస్తాకి సహోదరులవలె వెలుగుచూ , స్వామియొక్క
గణాధిపతులై , స్వామి యొక్క ఆజ్ఞకు లోబడి నడచుకొనుమని ఆదేశించెను.
*మహాకాలుడు*
ఇతడి సహాయముతోనే స్వామి ఇంద్రాణి శీలమును కాపాడెను.
*ధ్యానము*
*ద్విభుజం పీన కృష్ణాంగం బభ్రుష్ మశ్రరు శిరోరూహం*
*గదాం ఖడ్గం చ బిభ్రాణం మహాకాళం వయంనమః*
ఇరుచేతుల యందునూ కత్తినీ , ఖడ్గమును ధరించి , ధృడమైన బలిష్టమైన నల్లని ఛాయను కలిగి , పసుపు వన్నెగల మీసమును , కేశమును కలిగి ఒప్పారు మహాకాలుని ధ్యానింతుము.
*మహావీరుడు*
*ధ్యానం*
*సాంద్ర నీరద సంకాశం కర్ణ విశ్రాంత మర్రుకం*
*దంష్ట్రా కరాళ వక్రం భ్రుకుటీకృత నేత్రకం*
*కర శోభిని గణిత్రంచ దండినం నీల వాససం*
*వశన జగ్రుతోఢ్యాణం వీరమీథే త్రిభంగికం*
నీలిమేఘము వంటి ఛాయను , చెవులవరకూ పెరిగియున్న మీసములను , కోరపళ్ళను , భీకరమైన
ముఖమును , దీర్ఘమైన కనుబొమ్మలను కలిగి , ఖడ్గమును చేత ధరించియూ , నీలిరంగు వస్త్రములను
ధరించియూ , తోలుతో చేయబడిన కత్తియొక్క ఒరను కలిగియూ త్రిభంగితముగా నిలచియుండు
మహావీరుని ధ్యానింతును.
*కరుప్పన్ అరగా నల్లనివాడు*
ఇతడిని శాస్తా యొక్క భూతగణాధిపతులలో ఒకరినిగా పేర్కొనవచ్చును. తమిళనాట గ్రామదేవత
అయిన అయ్యనార్ ఆలయములు అన్నిటియందునూ స్వామి ఆజ్ఞను శిరసా వహించువానిగా
చూడవచ్చును.
*'కృష్ణాభన్'* అని పిలువబడు కరుప్పన్ శివాంశ పొందినవాడు. ఒకసారి ఆవేశముగా పరమశివుడు తన యొక్క తొడను తట్టగా , ఆ రుద్రవేశ అంశతో జనించినవాడు కృష్ణాభన్. ఊరుపు నుండి జనించుటచే ఊరుజన్ అని కూడా పిలువబడును.
శబరిమల యందు స్వామి కొలువై యుండు అష్టాదశ పీఠములైన *'పదినెట్టాంబడి'* అని
పిలువబడు పదునెనిమిది పడికట్లకు కాపలాకాయువాడు *'కరుప్పన్'.*
*ధ్యానం*
*మాలా శూలం కుటారం వర మభయ ధనుశ్చక్ర కేటం కృపాణం*
*హసైః శక్త్యగ్ని పాశం శశిధర సకలం ఘోర నేత్రత్రయంచ*
*కంతే నాగాధిరత్నాభరణ శతయుతం నీలగాత్రం సుకేశం*
*దేవం నీలాంబరాఢ్యం సకల భయహరం ఊరుజం భావ యామి.*
సేవలన్నింటియందునూ ప్రధముడై , చంద్రఖడ్గము ధరించి మంత్రముచేత తంత్రముగా శత్రువులను
సంహరించుటకై స్వామి సన్నిధియందు కొలువైయుండువాడు.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
