శ్రీ మహాశాస్తా చరితము - 59 | సింధునదీ తీరమున అవతరించిన వైనము | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 59 | సింధునదీ తీరమున అవతరించిన వైనము | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

సింధునదీ తీరమున అవతరించిన వైనము 

ప్రకృతి రమణీయకతను సంతరించుకున్న గాంధారదేశమును మునుపు ఒక సమయమున
*'బాలదేవుడను'* రాజు పరిపాలించుచుండెను. అతడు మహ పరాక్రమంతుడై యుండెను. శాస్తాయందు
అమితమైన భక్తి కలిగి యుండెను ధర్మనిరతితో పరిపాలించుచుండెను. ధార్మిక మార్గమునందునూ
ప్రీతి కలిగి యుండినవాడై జ్ఞానులను , ఋషులను ఆదరించుచూ , వారు సాక్షాత్తు శాస్తా యొక్క
ప్రతిరూపములుగనే భావించసాగెను.

గాంధార దేశపు రాజధాని యందు , బాలదేవుని బాల్య స్నేహితుడైన *'దయాకరుడు'* అనువాడు వ్యాపారము చేయుచుండెడివాడు. వ్యాపారనిమిత్తమై పలుదేశముల సంచరించు దయాకరుడు , ఆయాచోట్ల ఉండు ప్రసిద్ధి గాంచిన ఆలయములను దర్శించు చుండెడివాడు. స్వదేశమునకు తిరిగివచ్చిన పిదప ఆలయవిశేషములను తన స్నేహితునికి వర్ణించు చుండెడివాడు. అటుల ఒకసారి నేపాళ దేశమును పర్యటించిన పిమ్మట , విశేషములను తెలియజేయుటకై తన స్నేహితుడైన మహారాజు ధర్మమార్గమై వచ్చియుండెను. *“మహారాజా ! నేపాళ దేశమునందు అఖిలాండ నాయకుడైన శ్రీమహాశాస్తాకు బ్రహ్మాండమైన ఆలయము నిర్మింపబడియున్నది. స్వామి యొక్క దేవేరి అయిన శ్రీపుష్కలాదేవి జన్మించిన దేశము కదా ! ఫళింగ వర్మచే రూపుదిద్దబడిన ఆలయమున , ఎచట చూచిననూ కళాత్మకత ఉట్టిపడుచుండెను. అన్నిటికన్నా మిన్నగా స్వామియొక్క అనుగ్రహము అచ్చోట నిదర్శకముగా ప్రతిఫలించు చున్నది. అచట కొలువై యున్న స్వామి యొక్క అందచందములను వల్లింపనలని కాదు "* అంటూ అనుభవమును వర్ణించెను.

అసలే స్వామి యొక్క పరమభక్తుడైన అతడు. మిత్రుడు వర్ణించు చెప్పుటలో ఆస్థలమునకు వెళ్లి స్వామిని దర్శించవలెనని తొందరపడెను. కానీ కొన్ని కారణములచేత రాచరికపు కట్టుబాట్లకు లోనైన బాలదేవుని దేశము నేపాళదేశముతో శత్రుత్వము కలిగి యుండెను. రాచరికపు అంతస్థుతో నేపాళ
దేశమును చేరుకోలేని అశక్తత బాలదేవుని ఆవరించినది. కానీ ఆ దేశమునకు పోయి స్వామిని దర్శించవలెనన్న ఆతురత అధికముగా ఉండుటచే , ఒక సాధారణ వ్యాపారివలె మారువేషము ధరించి నేపాళదేశమును చేరనెంచెను. తన కుమారుని కొంతకాలము రాజ్యభారము అప్పగించి , వ్యాపారివలె నేపాళ దేశమును చేరెను.

దైవీక సౌందర్యము ప్రతిఫలించుచున్న ఆ ఆలయమును దర్శించినంత మాత్రమున మహారాజునకు ఆనందముతో ఒడలు గసర్పొడిచినది. పూర్ణా , పుష్కలా సమేతుడై కొలువై యున్న స్వామిని
చూచినంతనే మైమరచి ఆశువుగా కొన్ని గీతములు ఆలపించెను. అందము , లావణ్యము , కారుణ్యము మూర్తీభవించిన స్వామి యొక్క రూపు మహారాజును మైమరపించెను. అంతలోనే అతడికి ఒక
ఆలోచన కలిగెను. ఇటువంటి విగ్రహమునే తన రాజ్యమునందునూ ప్రతిష్ఠింపజేయవలెనని కోరిక కలిగెను.

అదే సమయమున విశ్వజిత్తుడను యోగి అచటికి వచ్చెను. అష్టాంగ యోగమును కూలంకుషముగా నేర్చిన అతడు , స్వామి యొక్క పరమభక్తి కారణముగా అపార తపోమహిమను కలిగి యుండెను.
తపోమహిమవలన అనేక శక్తులు పొందిన అతడు , తన ఇచ్చ వచ్చిన చోటికి , ఇచ్చవచ్చిన రూపు
ధరించి , కొన్నిసార్లు గాలిగా కూడా మారి , తన ఇష్టదైవమైన శాస్తాకొలువైయుండు ప్రదేశములన్నిటికీ
పోయివచ్చుచుండెను. బాలదేవుని యొక్క అదృష్ట వశమున ఆనాడు తలవని తలంపుగా అచటికి వచ్చిన యోగీంద్రుడు బాలదేవుడు స్వామిముందు మైమరచి నిలబడియున్న తీరు చూచి , అతడి యొక్క భక్తిని తెల్సికొన్నవాడై జ్ఞాననేత్రము వలన ఒక మహారాజైన అతడు స్వామి కొరకు మారువేషన వచ్చిన సంగతియూ ఎరిగియుండెను.

*బాలదేవుని మదిలోని కోరికయూ అవగతమైనది.*

వెంటనే బాలదేవుని ముందు తన స్వయరూపమున నిలచి , మహారాజు తన వివరములు తెలుపక మునుపే. అతడిని గూర్చిన వివరములు , అతడి మదిలోని కోరికయూ తనకు తెలిసినట్లుగా చెప్పెను. స్వామిని చూచిన ఆనందములో మైమరచియున్న మహారాజు , తన ముందు ఒక యోగీశ్వరుడు ప్రత్యక్ష మగుటతో ముందు ఆశ్చర్యపడిననూ , తెప్పరిల్లి , తన మనస్సులోని కోరిక
నెరవేరు మార్గమును తెలుపమనెను.

మహారాజు యొక్క భక్తికి మెచ్చిన యోగీంద్రుడు , తన తపోమహిమ చేత , ఆలయమున నున్న
విగ్రహమును పోలినటువంటిదే అయిన మరొక చిన్న విగ్రహమును సృష్టించి ఇచ్చెను. మహారాజుని ఉద్దేశించి *“మహారాజా ! ఈ విగ్రహము అత్యంత మహిమాన్వితమైనది. ఎంతో భక్తి శ్రద్ధలతో కొనిపోవలిసినది నీ కుడిచేత జాగ్రత్తగా పట్టుకుని నీ నగరమునకు పోవుము. మధ్యలో ఎక్కడా ఆగి , కింద పెట్టరాదు. అట్లు పెట్టినచో , అదేస్థలమున ఈ చిన్నివిగ్రహము స్థిరముగా నుండిపోయి , ఈ ఆలయమునందున్న విగ్రహము వలె పెద్దదిగా రూపుమారి , ఎవరివలననూ కదల్చలేనిదై పోవును. నీ కోరిక ప్రకారము ఈ విగ్రహమును గొనిపోయి, నీ దేశమందు ప్రతిష్ట చేసి ఆనందింపుము”* అని పలికి అంతర్ధానమైపోయెను.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow