శ్రీ మహాశాస్తా చరితము - 69 | అచ్చన్ కోవిల్ కరవాలము | | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 69 | అచ్చన్ కోవిల్ కరవాలము | | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

*అచ్చన్ కోవిల్ కరవాలము*

సదా దేవుని స్మరణలో మునిగియుండు భక్తుడు. స్వామిని సమీపించు సమయమున అత్యంత
జాగరూకుడై నియమ నిష్టలకు లోబడి నడచు కొనవలయును. భగవంతుడు భక్తుల యొక్క తప్పిదములను క్షమింపగలడు. కానీ పరులెవరైననూ స్వామిని అవమానించినచో భక్తుడు క్షమింపజాలడు.

పరశురామ క్షేత్రమునందు , స్వామి కొలువైయుండు అనేక స్థలములలో ఒకటైనది. పూర్ణా పుష్కలాసమేతునిగా వీక్షించు *'అచ్చన్ కోవిల్'* కేరళ ప్రాంతమునే పరశురామక్షేత్రమందురు. ప్రత్యక్ష దైవముగా కొనియాడబడుశాస్తాని సదా ధ్యానమునందు నిలుపుకొని యున్నవాడు తమిళనాడుకి చెందిన తిరునెల్వేలి తాలుకాకు చెందిన *'పాపుర్ సత్రం'* అను ఊరికి చెందిన ఒక బ్రాహ్మణుడు. అతడికి ఎప్పుడూ ఒకటే కోరిక , ఎప్పటికైననూ, దేవాది దేవతలచే కొనియాడబడు *'కాంత పర్వతమున వెలసియున్న పొన్నంబల నాధుని దర్శించవలెనన్నదే. ప్రతినిత్యమూ తన కోరికను విన్నవించుకొనుచుండెడి వాడు. దానికి తోడు ప్రతినిత్యమూ కరుప్పట్లో స్వామి ఉపాసనయూ చేయుచుండెడివాడు. సదా భక్తుని కోరికలు నెరవేర్చువాడైన శాస్తా బ్రాహ్మణుని కోరిక తీర్చుటకై కరుప్పణ్ణ స్వామిని అతడి వద్దకు పంపెను.*

కరుప్పణ్ణ స్వామి బ్రాహ్మణునితో *”విప్రవర్యా నీ కోరిక మేరకు , స్వామి వద్దకు కొనిపోవుటకై స్వామి పంపగా వచ్చినవాడను. కనులు మూసుకుని నాచేయి పట్టుకుని నావెంట రమ్ము. స్వామి కొలువైయుండు చోటికి కొనిపోదును , కానీ ఒక హెచ్చరిక సుమా ! కాంత పర్వతమునకు పోయిన సమయమున , ఎట్టి పరిస్థితిలోనూ అక్కడున్న వేటినీ తాకరాదు. మరల హెచ్చరించుచున్నాను”* అని పలికెను.

అందుకు సమ్మతించిన బ్రాహ్మణుడు , కరుప్పణ్ణ స్వామి చెప్పినట్లే అతడి చేయి పట్టుకుని , కనులు
మూసుకుని వెళ్ళెను. మరుక్షణము వారిరువురూ కాంత పర్వతమున నిలచియుండిరి. భక్తులను
అయస్కాంతము వలె ఆకర్షించు పర్వతము కదా అది. చూచినంతనే కనులు చెదరిపోవునట్లుగా
నవరత్న ఖచిత మణిమయములచే ఒప్పుచుండినది ఆ ఆలయము అమరులు ఏకాంతముగా స్వామిని కొలువబడు ఆస్థలమునందు పూర్ణా పుష్కలాసమేతునిగా పొన్నంబలమున స్వామి గంభీరముగా వీక్షించియుండెను. స్వర్ణకాంతులచే ప్రకాశింపబడుచున్న ఆ సభ యందు. ఆనంద పారవశ్యమున , స్వామి యొక్క దర్శన భాగ్యము వలన కలిగిన ఆనందముచేత తనను మరచి , తనకు కరుప్పట్టి
స్వామి చేసిన హెచ్చరికను సైతము మరచిన వాడయ్యెను. తన వలెనే భూలోకమున గల
అచ్చన్ కోవెల భక్తులు కూడా ఆనందింపవలెనన్న కోరికతో , స్వామి యొక్క సంకేతముగా కరవాలమును భూలోకమునకు కొనిపోవు కోరికతో తాకినంతనే , మరుక్షణము ఆకత్తితో సహా భూలోకమున నున్న
అచ్చనకోవెల యందు విసరివేయబడెను. కరుప్పణ్ణ స్వామి హెచ్చరించినట్లుగానే ఆబ్రాహ్మణుడు
అంధుడాయెను.

అతడు చేసిన తప్పుకి ఫలితముగా ఈనాటి వరకూ అతడి సంతతి యంతయూ అంధత్వముతో
బాధపడుచున్నది. అతడిచే కొనిరాబడిన కరవాలము ఆలయమునందు స్థిరముగా నిలచిపోయెను.

మేలిమి బంగారముతో మెరిసిపోవుచున్న ఆ కరవాలము అచ్చన్ కోవెలలో కొలువై యున్న
స్వామికి మరింత వన్నె తెచ్చినది.


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow