కుండపోతగా కురియు వర్షమును శాస్తా ఆపివేసిన విధము
ఏటికి ముమ్మారు కురియు వర్షపాతముచే , అంతటా పచ్చదనము కలిగి యుండు పర్వతములతో
ఒప్పుచున్న పరశురామ క్షేత్రమందు , మాంత్రిక కుటుంబమునకు సంబంధించిన వారిలో నంబూద్రి కుటుంబము ఒకటి. అటవంటి కుటుంబమునకు చెందిన నంబూద్రి యనువాడు శాస్తా యొక్క పరమ భక్తుడై జీవించు చుండెను.
*'భారతపుళ'* అను ఏటి మధ్యభాగమునందు స్వయంభువుగా అవతరించిన శాస్తాయందు అమితమైన భక్తి కలిగి యుండిన వాడు. అతడు ఎంతటి పరమ భక్తుడనగా , పిలిచినంతనే స్వామి వచ్చి కారణమేమని అడుగునంతటి చనువుగలవాడు. స్వామికి , నంబూద్రికి మధ్య అంతటి సత్సంబంధము నెలకొని యుండినది.
ధర్మనిరతి కలిగి ధర్మానుష్టానములను , ఆచార సంప్రదాయములను ఆచరించుచూ , తన యొక్క తాంత్రిక కుటుంబ బాధ్యతలను సైతము మరువక నెరవేర్చుచుండెను.
ఒకసారి నంబూద్రి యొక్క తండ్రిగారి ఆబ్దికము వచ్చినది. భక్తిశ్రద్ధలతో తనయుడైనవాడు.
ఆచరింపవలసినది కదా పితృ కర్మ. ఆ పితృకర్మకు ఫలితము నొసగువాడు కూడా శాస్తాయేకదా !
కేరళ సంప్రదాయము ప్రకారము పితృకర్మజరుపుటకై ముందుగా , ఇంటి ముందర ఒక పందిరిని.
నిర్మించెను.
కానీ ఆ సమయము వర్షాకాలమగుటచే , శ్రాద్ధము చేయు సమయమున వర్షము వచ్చినచో , ఆ జల్లునకు పందిరి ఆగునా ! ఒకవేళ అట్లు జరిగినచో పితృకార్యము మధ్యలో ఆటంకమూ వచ్చి
ఆగిపోవును కదా అని అందరూ సంశయించునంతలో , వర్షము అధికముగా కురియు సూచనలు
కనిపించినవి.
తన యొక్క ప్రతి కష్టమునూ స్వామితో మొరపెట్టుకొను వాడైన నంబూద్రి , వర్షము కారణముగా తన తండ్రిగారి ఆబ్దికము నిలిచిపోకుండునట్లుగా భక్తి ప్రపత్తులతో పదిశ్లోకములు చదువుతూ
ప్రార్థించెను. ఆ శ్లోకములను ఒక తాళపత్రమున లిఖించి , *సమ్మరవట్టం శాస్తా* అను పేరిట , స్వామి
కొలువై యున్న *'భరతపుళ'* ఏటి యందలి నీటిలో వదలివైచెను.
భక్తుల కష్టములను తొలగించుటే కదా స్వామి యొక్క పని ఆ తాళపత్రము నీటియందు
తేలియాడుచూ పోయి , సరిగ్గా స్వామి అవతరించి యున్న చోటికి పోయి అతడి పాదముల చెంత
చేరినది. మరుక్షణమే కుండపోతగా కురియు వర్షము ఆగిపోయినది. నంబూద్రి చేయు పితృకార్యము
నిరాటంకముగా కొనసాగినది. వచ్చినవారందరూ తిరిగి పోయిన పిదప , ఆగిపోయిన వర్ణము
మరల కురియుచుండెను.
*ఆనాటినుండీ ఈనాటి వరకూ వర్షములు కురియక నేల ఎండుబారి పోయిననూ , అధికముగా వర్షము కురియు సమయముననూ , కేరళ ప్రజలు 🌹సమ్మరపట్టం శాస్తాకు🌹 తాళపత్రముపై సందేశము వ్రాసి పంపుట ఆచారమైనది.*
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*